17 April, 2026 | 5:47 PM

భిన్నత్వంలో ఏకత్వమే జాతీయ భాష

04-06-2025 12:47 AM
  1. ఉగ్రవాదంపై పోరుకు కట్టుబడి ఉన్నాం
  2. డీఎంకే ఎంపీ కనిమొళి
  3. ఎంపీల బృందంతో స్పెయిన్‌లో పర్యటన

న్యూఢిల్లీ, జూన్ 3: ఆపరేషన్ సిందూర్ వివరాలు, ఉగ్రవాదంపై భారత పోరాటాన్ని గురించి వివరించేందుకు భారత్‌కు చెందిన పలువురు అఖిలపక్ష ఎంపీలు వివిధ దేశాల్లో పర్యటిస్తున్నారు. డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలోని బృందం స్పెయిన్ కు వెళ్లింది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో ఎన్‌ఆర్‌ఐలతో ఏర్పాటు చేసిన సమావేశంలో భారతీయ అధికార భాష గురించి ప్రశ్న ఎదురుకాగా.. కనిమొళి ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

‘ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ జాతీయ భాష. ఈ సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకే ఎంపీల బృందం ఇక్కడకు వచ్చింది. భిన్నత్వంలో ఏకత్వం రాజ్యాంగంలో పొం దుపరిచారు. ఏ ఒక్క భాషను జాతీయ భాషగా ప్రకటించలేదు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో 22 అధికార భాషలను గుర్తించారు.’ అని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరుకు కట్టు బడి ఉన్నామని కనిమొళి తెలిపారు.