21 March, 2026 | 2:53 AM

గిరిజనులను నిండా ముంచిన బడ్జెట్

21-03-2026 01:24 AM

గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు రాజలింగం నాయక్

భీమదేవరపల్లి, మార్చి 20( విజయక్రాంతి): గిరిజనులకు ఈ బడ్జెట్లో తీరని అన్యాయం చేసిందని బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాజలింగం నాయక్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో కేటాయించిన బడ్జెట్ 40 శాతం కూడా ఖర్చు చేయని రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో 7937 కోట్లు కేటాయించిందని అన్నారు.

గతంలో కేటాయించిన బడ్జెట్ కు 2000 కోట్లు కూడా ఖర్చు చేయలేదని పేర్కొన్నారు. గిరిజనులను నయవంచన చేసి కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో గిరిజనులను మోసం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉందని అన్నారు . ఇది మూడో బడ్జెట్ మూడు బడ్జెట్లో కూడా గిరిజనులకు తీరని అన్యాయం చేసింది కేటాయించిన బడ్జెట్ను 40% కూడా ఖర్చు చేయని ఈ బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని లంబాడి హక్కుల పోరాట సమితి భావిస్తున్నది అన్నారు.

ఇలాంటి మోసకారి బడ్జెట్ను లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. 6 గ్యారంటీల పేరు చెబుతూ ప్రజలను మోసం చేస్తుందని ఎస్సీఎస్లకు ఇచ్చిన చేవెళ్ల  డిక్లరేషన్ హామీలు గాలికి వదిలేసిందని ఇది  ప్రజా వ్యతిరేక బడ్జెట్ , ఇది గిరిజన ప్రజలకు మోసం చేసిన బడ్జెట్గా భావిస్తున్నామన్నారు. సమావేశంలో పలువురు గిరిజన నాయకులు పాల్గొన్నారు.