21 March, 2026 | 2:53 AM

జాతీయ స్థాయి సంగీత పోటీలో పారమిత హెరిటేజ్ విద్యార్థుల ప్రతిభ

21-03-2026 01:24 AM

కొత్తపల్లి, మార్చి 20(విజయక్రాంతి): భారతదేశపు ప్రముఖ వర్చువల్ ఈవెంట్ సంస్థ అయిన గ్లిట్జ్ & గ్లోరీ, పూణే  ఆద్వర్యంలో ఇటీవల నిర్వహించిన  జాతీయ స్థాయి సంగీత పోటీలలో స్థానిక నగరం లోని పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో పథకాలు సాధించారని పాఠశాల డైరెక్టర్  కె.హన్మంత రావు తెలిపారు.స్టార్స్ ఆఫ్ ఇండియా అవారడ్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీ, దేశవ్యాప్తంగా ఉన్న నిజమైన ప్రతిభను గుర్తించే ఒక అత్యంత ప్రతిష్టాత్మక వేదిక.

వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన పోటీదారులతో తలపడి, పారమిత హెరిటేజ్ పాఠశాల కు చెందిన 7వ తరగతి విద్యార్థి కిట్ల చరణ్ వాయిద్య సంగీత విభాగంలో మొదటి స్థానం సాధించగా, 9వ తరగతికి చెందిన ఎస్. శ్రీ సాన్విక గాత్ర సంగీత విభాగంలో రెండవ స్థానం సాధించారు.జాతీయస్థాయి లో అవార్డులు పొందిన విద్యార్థులను మరియు సంగీత ఉపాధ్యాయులను పారమిత విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఇ.ప్రసాద రావు, డైరెక్టర్లు ప్రసూన, అనూకర్ రావు,  రష్మిత, రాకేష్, వి.యు.యం. ప్రసాద్, వినోద్ రావు, ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ హన్మంత రావు,  ప్రధానోపాధ్యాయులు గోపీకృష్ణ, సమన్వయకర్తలు  రబీంద్రపాత్రో, భవానీ, నిఖిత  మరియు సంగీత ఉపాధ్యాయులు జితుమణి శర్మ, కిరణ్ లు   పాల్గొన్నారు.