అఫిడవిట్‌లో కంటే నాకు గజం ఎక్కువ ఉన్నా ప్రభుత్వానికే

17-09-2026 | 05:20am
  1. సీఎం ప్రస్తావించిన అందరి భూములపై సీబీఐ విచారణ జరపాలి
  2. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి) : ఎన్నికల అఫిడవిట్‌(Election Affidavit)లో పేర్కొన్న భూముల కన్నా నాకు గజం భూమి ఎక్కువ ఉన్నా ప్రభుత్వానికే సరెండర్ చేస్తానని తెలంగాణ రక్షణ సేన(Telangana Protection Force) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) తేల్చిచెప్పారు. బుధవారం అసెంబ్లీలో 22ఏపై జరిగిన చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) తన కుటుంబానికి ఎక్కడో భూములు ఉన్నట్టుగా ప్రస్తావించడంపై ట్విట్టర్ వేదికగా కవిత స్పందించారు. అసెంబ్లీలో సీఎం ఎవరెవరి పేర్లు ప్రస్తావించి, వారికి ఎక్కువ భూములు ఉన్నట్టుగా చెప్పారో వారందరిపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

సీఎం ఎవరెవరికి అక్రమ భూములు(Illegally held lands) ఉన్నట్టు చెప్పారో వారందరిపై సరైన విచారణ జరిపిస్తారన్న నమ్మకం తనకు లేదన్నారు. సీఎం చదివిన చిట్టాలో నిజాలు నిగ్గు తేలాలంటే గుంట నక్క, కేసీఆర్ ఫాం హౌస్‌లో ఉండే సీఎం గూఢచారి సహా నవీన్‌రావు, కొండల్ రావు, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, రామేశ్వర్ రావు, ప్రతిమ శ్రీనివాస్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి సహా అందరి భూములపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. తాను ఎప్పటి నుంచో చెప్తున్నట్టుగా గుంపు మేస్త్రీ కలిసే ఉన్నారని మరోసారి స్పష్టం చేశారు. వారిద్దరూ కలిసే ఈ డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. 

మరిన్ని వార్తలు