4 May, 2026 | 3:24 AM

అవినీతి మార్కు పాలన..?

04-05-2026 02:09 AM
  1. పాలకుడిపై విముఖత
  2. అధికారం కొందరికే
  3. పైసల్తోనే ప్రాధాన్యం
  4. సీనీయర్లకు గడ్డు రోజులు
  5. కాంగ్రెస్‌లో అసంతృప్తి సెగలు

 బెల్లంపల్లి, మే 3 : ఎన్నికలకు ముందు.. ప్రజలకి ఇచ్చిన నైతిక వాగ్దానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇచ్చిన హామీలు ఆచరణకు నోచుకోక పోవడం పైనే ప్రజలు చ ర్చించుకుంటున్నారు. తనకి డబ్బుపై ఆశలే దు. భూకబ్జాలు చేసే అఘాయిత్యం లేదు. మా నయనా సంపాదించి ఇచ్చిన వారసత్వ ఆస్తులు మాకుచాలు. మా నాయన పేరు నిలబెడుతూ ఆయన రాజకీయ వారసులు గా ప్రజలకు సేవ చేయడానికే రాజకీయా ల్లోకి వచ్చాం. ఇవి 2018 ఎన్నికల ముందు తొలిసారిగా బెల్లంపల్లి ప్రజలకి ఇచ్చిన నైతిక హామీలు.

అప్పటి వరకు అంటే 2014 నుం చి అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే భూ కబ్జాలు, అవినీతి అక్రమాలు ఒక్కటేమి టి సకల విమర్శల సుడిగుండంలో చిక్కుకుని ఉన్నారు. ఇవన్నీ ఆయనవి ప్రత్యక్ష, పరోక్ష తప్పిదాలు కావచ్చు. కానీ ఎమ్మెల్యేగా నైతిక బాధ్యత వహించక తప్పలేదు. వాటిని మోయక తప్పనిసరి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న అసంతృప్తినీ ఆసరాగా చేసుకుని ఎన్నికల ముందు ఈ హామీలను ప్రజలు ఒకింత విశ్వసించారు.

కానీ అప్పటి బీఆర్‌ఎస్ చేపట్టిన అభివృద్ధి, కేసీఆర్ పొలిటికల్ గ్రాఫ్ బిముందు నిలువలేదు. ప్రజలు మార్పును స్వాగతించలేదు. మళ్ళీ బీఆర్‌ఎస్ కే పట్టం కట్టారు. అప్పడు వ్యక్తీకరించిన నైతిక హామీలు, వ్యక్తిత్వాన్ని మాత్రం బెల్లంపల్లి ప్ర జలు నమ్మారు. అందుకని 2023లో బెల్లంపల్లి ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు.

కాకా వెంకటస్వామినీ రాజకీయంగా బెల్లంపల్లి ప్ర జలు ఎన్నడూ ఎరుగరు. ఆ ఫ్యామిలీ నుంచి నూతనంగా ఎంట్రీనీ మాత్రం ప్రజలు స్వాగతించారు. 30 ఏళ్లకు గాను కాంగ్రెస్ ప్రాతి నిధ్యాన్ని ప్రజలు ఆమోదించారు. ఎమ్మెల్యేలు గెలిచి గడ్డం వినోద్ ఆ ఘనతకు కారకుడయ్యారు. రికార్డు బద్దలు కొట్టారు. ఇందులో సందేహం లేదు.

- రెండున్నర ఏళ్ల పని తీరు..

ఎమ్మెల్యేగా గెలిచి, అధికార కాలంలో సగం పూర్తయ్యింది. ఇక మిగిలింది సగం కాలం పాలన. పూర్తి చేసుకున్న రెండున్నర కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులు అటుంచితే.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను తల తన్నిపోయాడనే అపకీర్తిని ఈ రెండున్నర ఏండ్ల పదవీ కాలంలోనే నెత్తినేసుకున్నారని కాంగ్రె స్ శ్రేణులే పలు సందర్భాల్లో తప్పుల్ని ఎత్తిచూపారు. ఇంటాబయటా ఇదే స్వరం విని పిస్తోంది. భూ కబ్జాలు అలవాటు లేదన్నారు. ఆ సంగతిని అనుచరులే నిరూపించారు.

లంచగొండి తనం మా ఇంటా బయ ట లేదన్నారు. అదికూడా ప్రజలు చూశారు. పైసలేనిధి పని జరుగని తీరుపై లోకం కోడైకూస్తుంది. ప్రతి పనికి ఓ రేటు నిర్ణయిం చారు. అది పార్టీ టికెట్ల నుంచి మొదలుకొని నామినేటెడ్, కో- ఆప్షన్ల వరకూ చేతులు తడుపనిదే పదవులు వరించిన పరిస్థితిపై సొంత పార్టీలోనే గుసగుసలు గుప్పుమంటున్నాయి. చివరికి పార్టీలో పదవులు కావాలన్నా, కొత్తవారినీ పార్టీలోకి చేర్చుకోవడం వరకూ ముడుపులు ముట్ట చెప్పాల్సిందే.

ఈ వ్యవహారం పూర్తిగా జీర్ణించుకోలేని పరిస్థితి కాంగ్రెస్ లో నెలకొంది. పార్టీలో మెజార్టీ శ్రేణులు ముఖ్యంగా సీనియర్లు మరీ దయననియమైన గడ్డు పరిస్థితినీ ఎదుర్కొంటున్నారు. 30 ఏళ్ళు అధికారానికి దూరంగా బతికిన కాంగ్రెస్ శ్రేణులు ప్రస్తుతం అనధికార, రాజకీయ నిస్సహాయ జీవితాలనే వెల్లధీస్తున్నామని వాపోతున్నారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ పూర్వ పరిస్థితి ఇప్పటికీ వారి ముందు కదలాడుతున్నది.

అధికార పార్టీలో ఉన్నప్పటికీ వారి ఆశలు, ఆశయాలను ఆత్మగౌరవాన్ని పట్టించుకునే వారే లేరన్న అసంతృప్తిలో మునిగిపోయారు. ఇదే పరిస్థితీ నియోజకవర్గం పార్టీ మొత్తంగా ఆవరించి ఉందినీ తెలుస్తోంది.. మండలానీకో గ్రూపు ను ఏర్పాటు చేసుకుని వారి కనుసన్నల్లోనే ఏ పనైనా వారి ఫార్మేట్లో నే పనిజరగాలి. ఇదిలా ఉంటే ప్రతి మండలంలో అసమ్మతి మెజార్టీ అట్టడుగు శ్రేణులు కాంగ్రెస్ లో నిరాదరణ కు గురవుతున్న సమూహం ఉన్నది. రాజకీయ బలవంతులు మాత్రమే రాజధానికి వెళ్తూ వస్తుంటారు. 

వారి పనులు వారు సాఫీగా చేసుకుంటారు. ఎటొచ్చీ సామాన్య శ్రేణులే అంతదూరం వెళ్ళలేరు. వెళ్ళే స్తోమత వారికి లేదు. పలుకుబడి నేర్పిన వాళ్ళదే కాంగ్రెస్లో రాజ్యం.. ఈ పరిస్థితీ త్వరగా మారాలని,ఆ రోజులకోసం కాంగ్రెస్ శ్రేణులు ఎదురు చూస్తున్నది మాత్రం వాస్తవం..