4 May, 2026 | 4:00 AM

నకిలీలతో జాగ్రత్త!

04-05-2026 02:48 AM
  1. సీజన్‌కు ముందుగానే జిల్లాకు చేరుకున్న నకిలీ విత్తనాలు
  2. నిండా ముంచుతున్న మోసగాళ్ళు
  3. నకిలీ విత్తనాలను అంతగడుతున్న కేటుగాళ్ళు
  4. పట్టించుకోని అధికారులు

మెదక్, మే 3 (విజయ క్రాంతి) :వానాకాలం సీజన్ సాగు ప్రణాళికలు రచించ డంలో జిల్లా యంత్రాంగం సిద్దం అవుతుం ది. వీరి కంటే ముందే నకిలీ ముఠా గుట్టు చప్పుడు కాకుండా మెదక్ జిల్లాకు నకిలీ విత్తనాలను చేరవేస్తున్నట్టు సమాచారం. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా యంత్రాం గం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఇదే అదనుగా భావించి కొందరు వ్యాపారులు వర్షాలు పడక ముందే గ్రామాల్లో రైతులకు నకిలీ విత్తనాల విక్రయాలు గుట్టుగా సాగిస్తున్నట్టు తెలుస్తుంది.

 ప్రతీ ఏటా ఖరీఫ్ వచ్చిందంటే చాలు

ప్రతీ ఏటా ఖరీఫ్ సీజన్ వచ్చిందంటే చాలు నకిలీ విత్తనాలతో రైతులు కుదేలవుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో విక్రయదారులు నకిలీ, నాసిరకం విత్తనాలను అన్నదాతలకు అంటగాడుతున్నారు. వీటిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నా అవి నామ మాత్రమేనని చెప్పకతప్పదు. దీంతో నకిలీ విత్తనాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్న పలు కంపెనీలకు చెందిన డీలర్లు ఈ విత్తనాలను గ్రామాల్లో ఎక్కువగా విక్రయిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు విత్తనాల దు కాణాల్లో తనిఖీలు చేస్తున్నారే తప్పా గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు ఉన్నాయి.

నకిలీ విత్తన సరఫరాదా రుల ఆగడాలు మితిమీరుతున్నాయి. మెదక్ జిల్లాలోని పలు మండలాల్లో నకిలీ విత్తనాలను కొనుగోలు చేసిన కర్షకులు అనేక నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు చేపట్టకపోవడంతో ప్రతీ ఏటా రైతులు నట్టే ట మునుగుతున్నారు.

దీనిపై దృష్టిసారించిన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ నకిలీలను అరికట్టేందుకు అధికార యంత్రాంగం న డుం బిగించాలని, బాధ్యులపై, సంబంధిత వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో మెదక్ జిల్లాలోని ఆయా మండలాలు, డివిజన్ కేంద్రాల్లో ప్రత్యేక టాస్క్ఫోర్స్ వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడుతున్నారు. తాజాగా నకిలీ విత్తనాలను విక్రయిం చే వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

 జిల్లాలో పంటల సాగు ఇలా.. 

మెదక్ జిల్లాలో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయమే. జిల్లాలో సుమారు 3 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉంది. ఇందులో వరిని 2 లక్షలకు పై చిలుకు సాగు చేస్తుండగా, సోయాబీన్, కందులు, పత్తి, ఇతర ఆరుతడి పంటలు సాగవుతున్నాయి. జిలా ్లలో ఎక్కువగా వరి పంట సాగు చేస్తుండడంతో కొంతమంది ప్రైవేట్ వ్యాపారులు పలు రకాల విత్తన కంపెనీల పేరుతో మార్కె ట్లో విత్తనాలను విక్రయిస్తున్నారు. అందులో చాలా వరకు నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.

నకిలీ విత్తనాలు కావడంతో డిమాం డ్ను బట్టి వాటి ధరలను తక్కువ చేసి అమ్ముతున్నారు. తెలియక వాటిని కొనుగోలు చేసిన అన్నదాతలు సాగుసరిగ్గా రాక తీవ్రం గా నష్టపోతున్నారు.గత కొద్దికాలంగా జిల్లా లో పలు మండలాల్లో నకిలీ విత్తనాల కారణంగా వేలాది మంది రైతుల పంట పొలా ల్లో పంటలు ఏపుగా పెరిగినప్పటికీ దిగుబడి సరిగ్గా రాపోవడంతో నష్టాలను చవిచూశారు. నకిలీ విత్తనాలపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారికి ఎలాంటి న్యా యం జరగలేదు. జిల్లాలోని తూప్రాన్, మనోహరాబాద్ ప్రాంతాల్లో నకిలీ విత్తనాలను ప్యాకెట్లలో ప్యాక్ చేస్తుండగా వ్యవ సాయ శాఖ అధికారులు పట్టుకున్నారు. వారిపై కేసులు సైతం నమోదు చేశారు.

 నకిలీ విత్తనాలను అరికట్టేందుకు చర్యలు 

మెదక్ జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. అయితే నకిలీ విత్తనాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే అన్ని మండలాల వ్యవసాయ శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. దీంతో పాటు మండలానికో టాస్క్ఫో ర్స్ కమిటీని ఏర్పాటు చేశామని, ఎక్కడ నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినా వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుం టామని అన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీలో తహసీల్దార్, ఎస్త్స్ర, వ్యవసాయ శాఖ అధికారులు ఉంటారు.

వీరు ఆయా మండల కేంద్రాల్లోని విత్తనాలు, ఎరువుల దుకాణాలు, గోదాంల్లో తనిఖీలు చేపడుతున్నారు. దీంతో పాటు ట్రాన్స్పోర్ట్ల వద్ద సైతం కమిటీ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గోదాములు, విత్తనాల డీలర్ల షాపుల్లో తనిఖీలు చేపడుతున్నారు. ఇటీవల జిల్లా బృందం మెదక్ పట్టణంలోని పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టేందుకు సిద్ధం అయింది. అయితే బృందాలు వచ్చే విషయం నకిలీలకు ముందే తెలియడంతో ఆరోజు షాపులు మూసి ఉంచుతున్నారు. దీంతో వారు అక్కడక్కడ నామమాత్రంగా తనిఖీలు నిర్వహించి వెళ్లారు. 

 తనిఖీల కోసం టాస్క్ ఫోర్స్ బృందాలు... 

వ్యవసాయ శాఖ, పోలీసు శాఖ, సీడ్ కార్పొరేషన్లు (టీ ఎస్ ఎస్ డీ సీ /టీ ఎస్ ఎస్ ఓ సి ఏ), రవాణా శాఖల సమన్వయంతో టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాలో 1 జిల్లా స్థాయి బృందం, 3 డివిజనల్ స్థాయి బృందాలు, 21 మండల స్థాయి బృందాలు పనిచేస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 334 రిటైల్ విత్తన దుకాణాలు, 41 విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు, 334 లైసెన్సు కలిగిన విత్తన హోల్డర్లు ఉన్నారని. ముఖ్యంగా పత్తి, వరి పంటలలో నకిలీ విత్తనాల సమస్య ఎక్కువగా ఉన్నందున, సీజన్ మొత్తం కఠిన తనిఖీలు నిర్వహించేలా చర్యలు తీసుకోనున్నారు.

నకిలీ విత్తనాలు అనగా లైసెన్సు లేని సంస్థలు తయారు చేసినవని అనధికారికంగా విక్రయించబడినవి అని సరైన లేబులింగ్ లేని ప్యాకెట్లు, గడువు ముగిసినవి, ఉంటాయని టాస్క్ఫోర్స్ తనిఖీలలో సుదీర్ఘ పరిశీలన చేపట్టాలి. నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై పిడి (Pౄ) యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని ఆదేశాలు ఉన్నాయి. 2026 వానాకాలంలో సుమారు 03 లక్షల 26 ఎకరాల్లో సాగు అంచనా వేయగా, దానికి సరిపడా విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకొంటున్నారు.

 రైతులు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి.. 

రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. నష్టం వాటిల్లినప్పుడు రశీదు ఉంటేనే ప్రభుత్వం తరపున సాయం అందే వీలుంటుందని, లేదంటే నకిలీ విత్తనాలతో నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. రశీదులు లేకపోవడంతో జిల్లాలో నకిలీ విత్తనాలతో అక్కడక్కడ నష్టపోతున్న అన్నదాతల నుంచి ఫిర్యాదులు అందుతున్నా విచారణ దశకు వచ్చే సరికి కేసు నీరుగారిపోతున్నాయి.