9 June, 2026 | 2:32 AM

ప్రేమలో మోసపోయిన యువకుడి ఒక కోర్టు కేస్

09-06-2026 01:15 AM

ప్రేమ, విరహం, మోసం వంటి అంశాల చుట్టూ ఇప్పటికే టాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ, ప్రేమలో మోసపోయిన ఓ యువకుడు న్యా యం కోరుతూ కోర్టును ఆశ్రయించడం అనే వినూ త్న కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘ఒక కోర్టు కేస్’. ఓపెన్ ఐస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అండమాన్‌కు చెందిన యువ దర్శకుడు గణేశ్ పూడి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ స్వయంగా దర్శకత్వం వహించి నిర్మించారు. ఈ చిత్రంలో సూర్యాన్ష్, తనిషా మిశ్రా హీరోహీరోయిన్లు.

చిత్రం జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో టీజర్‌ను ప్రముఖ హీరో శ్రీకాంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. “ప్రేమలో జరిగే సంఘటనలను లీగల్ డ్రామాగా మలచడం ఆసక్తికరంగా అనిపించింది” అన్నారు. హీరో సూర్యాన్ష్ మాట్లాడుతూ.. “ఒక కోర్టు కేస్’ నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన సినిమా’ అని తెలిపారు. హీరోయిన్ తనిషా మిశ్రా మాట్లాడుతూ.. “ప్రేమ, భావోద్వేగాలు, సంఘర్షణలతో కూడిన నా పాత్ర ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది” అని చెప్పారు. దర్శక నిర్మాత గణేశ్ పూడి మాట్లాడుతూ.. “ప్రేక్షకులకు ఇది కొత్త అనుభూతిని అందిస్తుందనే నమ్మకం ఉంది” అని తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ధారన్ సుక్రే; సంగీతం: హర్ష ప్రవీణ్.