అనుబంధాల చుట్టూ వంద దేవుళ్లు
09-06-2026 01:16 AM
విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించిన చిత్రం ‘వంద దేవుళ్లు’. రామాంజనేయు లు నిర్మించిన ఈ చిత్రాన్ని జూన్ 19న విడుదల చేయబోతోన్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తే.. ఈ కథలో భార్యాభర్తల బంధం, తల్లీకొడుకుల అనుబంధాన్ని గొప్పగా చూపించినట్టు కనిపిస్తోంది. ఈ సినిమాకు ఎస్‌బీ దర్శన్ కిర్లోష్ కెమెరా మెన్‌గా, బాలాజీ శ్రీరామ్ సంగీత దర్శకుడిగా, హరీష్ యువరాజ్ ఎడిటర్‌గా, భాష్యశ్రీ డైలాగ్ రైటర్‌గా పనిచేశారు.






