13 June, 2026 | 1:46 AM

క్రేజీ కాంబో సెట్

13-06-2026 12:00 AM

టాలీవుడ్‌లో మరో ఆసక్తికర కాంబో సిద్ధమవుతోంది. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. డైరెక్టర్ సుకుమార్ ‘పుష్ప2’ బ్లాక్‌బస్టర్ తర్వాత రామ్‌చరణ్‌తో సినిమా సన్నాహాల్లో ఉన్నా రు. బన్నీ వాస్ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా హిట్ సినిమాలు చేస్తున్నారు. ప్రియదర్శి హీరోగా ఆసక్తికరమైన సినిమాలతో అలరిస్తున్నారు. ఇప్పుడీ త్రయం కలయిక.. సినీప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ప్రాజెక్టుకు దర్శకుడు ఎవరు? ప్రధాన తారాగణం ఏంటి? సాంకేతిక నిపుణులు ఎవరు? అనే విషయాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.