29 July, 2026 | 9:55 PM

Breaking News

బురదలో చిక్కుకున్న ఆర్టిసి బస్సు   •   ఓటు హక్కు అమూల్యం.. దరఖాస్తులో జాప్యం వద్దు   •   భద్రాద్రిలో ఘనంగా పోకల దమ్మక్క సేవ యాత్ర   •   శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి   •   బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ప్లేట్లు, నోట్‌బుక్స్ పంపిణీ   •   విశ్వబ్రాహ్మణ సంఘం గుండి గ్రామ కమిటీ ఏర్పాటు   •   సిఐ నీలం రవికి ఘన సన్మానం   •   మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   తెలంగాణ జలసిరిపై ప్రజలకు అవగాహన కల్పించిన పెద్దకాపర్తి సర్పంచ్   •   నల్లబండగూడెం సాయిమందిరంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు   •  

కిరణ్ అబ్బవరం స్వీయ దర్శకత్వంలో..

13-06-2026 12:00 AM

ఇప్పటివరకు హీరోగా అలరించిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన తాజాచిత్రంలో హీరోగా నటించడమే కాక కథా రచయితగా, స్క్రీన్‌ప్లే రచయితగా, దర్శకుడిగా బాధ్యతలు చేపట్టారు. డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ చాగంటి ఈ సినిమాను తన జాయ్ ఫిలమ్స్ బ్యానర్‌పై రూపొందిస్తూ, నిర్మాతగా అరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రంతో కన్నడ బ్యూటీ దేవికా భట్ తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమవుతోంది.

శరత్‌కుమార్, సాయికుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవం అనంతరం వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. తొలి షెడ్యూల్లో ప్రధాన తారాగణం పాల్గొంటోంది. దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే కిరణ్ అబ్బవరం పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేశారు. ఈ చిత్రానికి విశ్వాస్ డేనియల్ డీవోపీ కాగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సుధీర్ మాచర్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా, సంతోష్ నాయుడు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.