క్లైమాక్స్ మూడ్‌లో భోగి టీమ్
చార్మింగ్ స్టార్ శర్వా పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ చిత్రం ‘భోగి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు సంపత్ నందితో శర్వానంద్ చేస్తున్న తొలి సినిమా ఇది. శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక కాగా, డింపుల్ హయతి మరో హీరోయిన్‌గా నటిస్తోంది. 1960ల నాటి నేపథ్యంలోని తెలంగాణ సరిహద్దులోని ఒక ఫిక్షనల్ విలేజ్‌లో జరిగే పీరియడ్ యాక్షన్ డ్రామా ఇది.
ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన ఫస్ట్-లుక్, ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్‌లో హై ఆక్టేవ్ ఎమోషనల్ యాక్షన్ క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ కీలక భాగాన్ని పూర్తిచేసేందుకు ఈ తాజా షెడ్యూల్‌ను 20 రోజుల పాటు కొనసాగనుంచనున్నారు. స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో ఈ సన్నివేశాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో శర్వా ఎంతో బలమైన, సాహసోపేతమైన స్టంట్లలో పాల్గొంటున్నారు. రక్షాబంధన్ సందర్భంగా ఆగస్టు 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో; డీవోపీ: కిషోర్ కుమార్ ఆరోకియా; ఆర్ట్: కిరణ్‌కుమార్ మన్నె.






