1 September, 2026 | 10:35 PM

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబుకు ఘన స్వాగతం

15-06-2025 | 10:24pm

సుల్తానాబాద్, పెద్దపల్లి, కమాన్ పూర్ లో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు..

మంథని (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులై, మొదటిసారిగా మంథని నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరులు శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ళ శ్రీను బాబు(Duddilla Srinu Babu) వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం జిల్లాలోని సుల్తానాబాద్, పెద్దపల్లి, కమాన్ పూర్, కల్వచర్ల, సెంటర్ అది కాలనీలో, బేగంపేట, లద్నాపూర్ రామయ్యపల్లిలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కమాన్ పూర్, రామగిరి, మంథని, ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.