లారీ ఢీకొని మహిళా మృతి
27-06-2026 04:23 PM
చేగుంట,(విజయక్రాంతి): లారీ ఢీకొని మహిళ మృతి,చెందిన సంఘటన చేగుంట పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది, చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి వివరాలు ప్రకారం పట్టణానికి చెందిన కర్నే లక్ష్మి(35) నడుచుకుంటూ రోడ్డు దాటు తుండంగా, హైదరాబాద్ నుండి నిజాంబాద్ కి వెళ్తున్న లారీ వెనకా నుండి ఢీకొనడంతో ఆక్కడికి అక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి, సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు, ప్రారంభించారు, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.






