10 April, 2026 | 8:52 PM

Breaking News

ప్రజల ఆరోగ్య పరిరక్షణకే ప్రత్యేక వైద్య శిబిరం   •   అందరి సహకారంతోనే గ్రామాభివృద్ధి   •   నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి ఉపాధ్యక్షుడిని సన్మానం   •   గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్   •   చిన్నారికి ఆర్థిక సాయం అందజేసిన పిఎసిఎస్ మాజీ చైర్మన్ జాలే నరసింహారెడ్డి   •   శివంగాలపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహణ   •   బనిగండ్లపాడులో మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన బండారు   •   నిమ్మపల్లిలో యువతి అదృశ్యం – పోలీసుల దర్యాప్తు ప్రారంభం   •   నూతన తహసిల్దార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు   •   విద్యుత్ శాఖ కాంపౌండ్ లో అగ్నిప్రమాదం   •  

విద్యారంగానికి అధిక బడ్జెట్ కేటాయించాలి

02-12-2024 02:23 AM

ప్రొఫెసర్ హరగోపాల్

రంగారెడ్డి, డిసెంబర్1 (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి బడ్జెట్ అధిక  కేటాయింపులు చేపట్టాలని ప్రొఫెసర్ హర గోపాల్ అన్నారు. ఆదివారం షాద్‌నగర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన డీటీఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి ఉద్యోగ విరమణ అభినందన సభకు హరగోపాల్ హాజ రై మాట్లాడారు.

గత పాలకులు చేసిన విధంగానే నేటి పాలకులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు దూర దృష్టిలేకుండా తీసుకొంటున్న నిర్ణయాల కారణంగా నిరుపేదలు విద్యకు దూరం అవుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ఉపాధ్యాయ వృత్తి అనేది పాఠశాలకే పరిమితం కాదని సామాజిక బాధ్యతలో ఉపాధ్యాయులు పాత్రధారులు కావాలన్నారు.