30 June, 2026 | 10:47 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

చరిత్రకెక్కిన ముక్కల యుద్ధం

19-11-2024 12:55 AM

బీజేపీ ఎంపీ విందుపై అఖిలేశ్ యాదవ్ సెటైర్

లక్నో, నవంబర్ 18: బీజేపీ ఎంపీ విందుపై సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ సెటైరికల్ ఎద్దేవా చేశారు.  బీజేపీ ఎంపీ కార్యాలయంలో జరిగిన ‘మటన్‌వార్ చరిత్రకెక్కింది’ అని ఆయన విమర్శించారు. యూపీలోని మీర్జాపూర్‌లో బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ బింద్ పార్టీ నేతలు, కార్యకర్తలకు.. ఆయన కార్యాలయంలో శనివారం విందు ఇచ్చారు. అయితే విందులో మటన్ గ్రేవీలో మాసం ముక్కలు లేవని బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆరోపించారు.

అక్కడితో ఆగకుండా వడ్డించే వ్యక్తిని వారు తీవ్రంగా కొట్టారు. దీంతో ఆ విందులో గందరగోళం చెలరేగింది. బీజేపీ సీనియర్ నేతలు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ విషయమై మీడియాలో వచ్చిన కథనాలపై అఖిలేశ్ స్పందిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ‘వివిధ రకాల యుద్ధాలను చూశాం. మొట్టమొదటిసారిగా మటన్‌వార్‌ను చూస్తున్నాం’ అని బీజేపీ నేతలకు చురకలంటించారు.