30 June, 2026 | 9:53 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

బల్వంత్‌సింగ్ క్షమాభిక్షపై నిర్ణయం చెప్పండి

19-11-2024 12:44 AM

రాష్ట్రపతిని కోరిన సుప్రీం

న్యూఢిల్లీ, నవంబర్ 18: పంజాబ్ మాజీ సీఎం బియాంత్‌సింగ్ హత్య కేసులో మరణశిక్ష పడిన బల్వంత్ సింగ్ రాజోనా క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపదిముర్ము దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్రపతి కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విషయమై 2 వారాల్లోగా నిర్ణయం తెలి యజేయాలని ధర్మాసనం అభ్యర్థించింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను డిసెంబర్ 5కు వాయి దా వేసింది. సిక్కులకు ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌తో 1995లో జరిగిన దాడుల్లో చండీగఢ్‌లోని సచివా లయం ఎదుట జరిగిన పేలుడులో బియాంత్‌సింగ్‌తో పాటు మరో 16 మంది మరణించారు. ఈ పేలుడులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బల్వంత్‌సింగ్ రాజోనా ప్రమేయం ఉన్నట్లు రుజువు కావడంతో 2007లో అతడికి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ౨౦౧౨లో క్షమాభిక్ష కోసం బల్వంత్ అర్జీ పెట్టగా అప్పటినుంచి పిటిషన్ పెండింగ్‌లోనే ఉంది.