కోపంతోనే కన్నం!
బొల్లారం ఆయుధాల చోరీ కేసు ఛేదించిన పోలీసులు
రిటైర్డ్ ఆర్మీ హవల్దార్ మల్లేష్ ప్రధాన నిందితుడిగా గుర్తింపు
బలవంతపు రిటైర్మెంట్ ఇచ్చారని ఆగ్రహంతో చోరీ
నిందితుడి అరెస్టు, రిమాండ్.. ఆయుధాలు స్వాధీనం
వివరాలు వెల్లడించిన డీజేపీ సీవీ ఆనంద్
సికింద్రాబాద్/అచ్చంపేట, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): సికింద్రాబాద్(Secunderabad) బొల్లారం(Bollarum) మద్రాస్ రెజిమెంట్(Madras Regiment) 20వ బెటాలియన్ ఆయుధాల చోరీ కేసును తెలంగాణ పోలీసులు(Telangana Police) ఛేదించారు. సైన్యంలో పనిచేసి రిటైర్డ్ అయిన హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేష్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. అతడి నుంచి అత్యాధునిక ఆయుధాలు, మ్యాగజైన్లు, నైట్ విజన్ పరికరం, భారీగా మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో తెలంగాణ పోలీసులు, హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్‌ఫోర్స్(Hyderabad City Police Task Force), మల్కాజ్‌గిరి కమిషనరేట్(Malkajgiri Commissionerate) ఎస్‌ఓటీ, బొల్లారం పోలీసులు 12 బృం దాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారంతో గురువారం తెల్లవా రుజామున మల్లేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీజీపీ సీవీ ఆనంద్(DGP CV Anand) శుక్రవారం మీడియాకు వెల్లడించారు.
అకాల పదవీ విరమణపై తీవ్ర అసంతృప్తి, కోపం..
మల్లేష్ సుమారు 16 ఏళ్లపాటు భారత సైన్యంలో పని చేశాడు. 2026 జూన్ 30న ఉద్యోగ విరమణ పొందాడు. నిందితుడు మల్లేష్ క్రమశిక్షణా రాహిత్యం, కొన్ని ఆరోగ్య కారణాల వల్ల సర్వీస్ నుంచి తొలగించబడ్డాడు. తనకు ఇష్టం లేకపోయినా బలవం తంగా పదవీ విరమణ చేయించారనే కోపం, తీవ్ర అసంతృప్తి అతనిలో నెలకొంది.
ఆగస్టు 30 రాత్రి 11 గంటల సమయంలో మల్లేష్ కార్గిల్ గేట్ ద్వారా ఆయుధాలు భద్రపరిచే ‘కోట్’ గది, మ్యాగజైన్ గదిలోకి ప్రవే శించాడు. తాళాలను తొలగించి ఆయుధా లు, మ్యాగజైన్లు, బుల్లెట్లు, నైట్ విజన్ బైనాక్యులర్‌ను తీసుకుని స్కూటర్‌పై పరారయ్యా డు. సీసీ కెమెరాలకు చిక్కకుండా ఈ వ్యవహారం పూర్తి చేశాడు. ఆయుధ డిపో ఇంచా ర్జ్‌లు వినోద్‌కుమార్, బల్లి మధు, టీపీఎస్ రావు అనే హవల్దార్ సహకరించినట్లు తేలిం ది. వీరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
భార్య నిలదీయడంతో..
ఆయుధ సామగ్రి చోరీ కేసులో సుమా రు 16 మందిని పోలీసులు విచారించారు. ఈ క్రమంలో మల్లేష్ కదలికలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అతడి కాల్‌డేటా, వాట్సాప్ చాట్లను పరిశీలించగా కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. మల్లేష్‌ను భార్యను కూడా విచారించారు. భార్య నిలదీయడంతో మల్లేష్ చోరీ విషయాన్ని అంగీకరించాడు.
నల్లమల అడవులకు తరలింపు..
మల్లేష్ చోరీ చేసిన ఆయుధాలను నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల అడవుల్లోని అ మ్రాబాద్ ప్రాంతానికి తరలించి గోతిలో పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. వాటిని పోలీసులు సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. అచ్చంపేట నియోజకవర్గం పదర మండలం ఉడిమిళ్ల గ్రామానికి చెందిన వడ్డెర రాజు అలియాస్ మల్లేష్ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది. మల్లేష్‌ను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు డీజీపీ తెలిపారు. కేసును ఛేదించడంలో కీలకంగా పనిచేసిన పోలీసు, మిలిటరీ అధికారులను అభినందించారు.
రికవరీ చేసిన ఆయుధాలు ఇవే..
* 5 మ్యాగజైన్లతో కూడిన నాలుగు ఏకే-203 (7.62x39 mm) రైఫిళ్లు
* 3 మ్యాగజైన్ల ఒక 5.56mm ఇన్సాస్ (INSAS 1B1) రైఫిల్
* 12 మ్యాగజైన్ల ఆరు 9mm ఆటో 1A పిస్టళ్లు
* మ్యాగజైన్‌తో కూడిన ఒక సివిలియన్ 6.35- బోర్ పిస్టల్
* ఒక పాసివ్ నైట్-విజన్ బైనాక్యులర్ (రాత్రి వేళ చూసే దుర్భిణి)
* 9mm ఆటో 1A పిస్టల్‌కు చెందిన 1,156 రౌండ్ల సజీవ మందుగుండు సామగ్రి
* ఏకే-203 రైఫిళ్లకు చెందిన 720 రౌండ్ల తూటాలు
* 5.56mm ఇన్సాస్ తుపాకీకి చెందిన 11 బాల్ రౌండ్లు, 5 ట్రేసర్ రౌండ్లు మరియు 20 బ్లాంక్ రౌండు