9 April, 2026 | 4:17 AM

ఆస్పత్రి పునర్జన్మనిస్తుంది..

09-04-2026 01:27 AM

అభివృద్ధికి పునరంకితమై పనిచేస్తున్నాం 

అందరూ బాగుండాలి అన్నదే మా సంకల్పం

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

హన్వాడ, ఏప్రిల్ 8: అమ్మ జన్మనిస్తే ఆసుపత్రి పునర్జన్మ నిస్తుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బండమీది పల్లిలో సద్గురు శ్రీ మధు సూదన్ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్, వన్ వరల్ వన్ ఫ్యామిలీ మిషన్, శ్రీ జయరామ చారిటబుల్ ట్రస్ట్ సయుక్త ఆధ్వర్యంలో నిర్మించనున్న సాయి ఆరోగ్య సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు.

హన్వాడ మండలంలోని ముడా నిధులతో రూ 20 లక్షలతో కమిటీ హాల్ నిర్మా ణానికి భూమి పూజ,రూ 166 లక్షలతో సల్లోనిపల్లి గ్రామం నుంచి పలువు తండకు నిర్మించనున్న బీటీ రోడ్డు కు, రూ 830.50 లక్షల తో ఆయకట్టు కు సంబంధించి మూ డు చెక్ డ్యామ్ల నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు వివిధ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పా ల్గొని మాట్లాడారు. అభివృద్ధి ఎట్టి పరిస్థితిలో ఆగదని అందరూ సమిష్టిగా ఉంటూ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని స్పష్టం చేశారు.

ఎక్కడ ఎలాంటి ఇన్ని సమస్యలు ఉన్నా ప్రతి సమస్యను పరిష్కరించుకోవడ మే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. మ న నగరం మహానగరం గా ఎదుగుతుందని ముందు అంచనాలతో ప్రతి ఒక్కరు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నా యకులు సిరాజ్ ఖాద్రీ, శ్రీ జయరామ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బెక్కెరి రాంరెడ్డి, కళ్యాణ్ , రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ లయన్ నటరాజ్, తదితరులున్నారు.