4 August, 2026 | 2:46 AM

అర్హులైన ప్రతి ఒక్క రికి ఇంటి స్థలం

04-08-2026 01:01 AM
  1. జర్నలిస్టుల కుటుంబాలకు రూ 5 లక్షల ఆరోగ్య బీమా
  2. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి

రాజేంద్రనగర్, ఆగస్టు 3(విజయక్రాంతి): అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఐదు లక్షల రూ పాయలు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రమాద బీమా సౌకర్యాన్ని  కల్పించేలా యూనియన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతుందని టీయూడ బ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. సోమవారం గండిపేట్ మండల జర్నలిస్ట్ అసోసియేషన్ ఎన్ని కలు మంచిరేవుల కమ్యూనిటీ హాల్‌లో జరిగాయి. రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, రంగా రెడ్డి జిల్లా అధ్యక్షుడు సలీం పాషా, ఉపాధ్యక్షుడు భీమన్న, జాయింట్ సెక్రటరీ సూర్య నారాయణ, కార్యనిర్వాహక కార్యదర్శి రా జేందర్ రెడ్డి, రాజు తదితర సీనియర్ జర్నలిస్టులు హాజరయ్యారు.

వార్త సీనియర్ జర్న లిస్టు రాము యాదవ్‌ను గండిపేట్ మం డల జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి  మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కా రం కోసం టీయూడబ్ల్యూజే నిరంతరం పో రాడుతుందని తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని, జర్నలిస్టుల కుటుం బాల ఆరోగ్య భీమా పథకం కోసం ఐదు లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రకటన చేస్తుందని తెలిపారు.