4 August, 2026 | 2:50 AM

అనారోగ్యంతో బాధపడుతున్న వార్డు సభ్యుడు బాబును పరామర్శించిన డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

04-08-2026 01:00 AM

నిజాంసాగర్ ఆగస్టు 3 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి గ్రామపంచాయతీ పరిధికి చెందిన 10వ వార్డు సభ్యుడు బాబు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు  ఏలే మల్లికార్జున్, గ్రామ సర్పంచ్ ఏలే సుగుణమ్మ సోమవారం రోజు వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా బాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు  దృష్టికి విషయం తీసుకెళ్లి, వైద్య చికిత్స కోసం అవసరమైన LOC (Letter of Credit) మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.