15 April, 2026 | 12:27 AM

అఖండ విజయం!

15-11-2025 12:00 AM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్‌కు అనుగుణంగా, ఊ హించిన దాని కంటే ఎక్కువ స్థానాలు గెలిచి ఎన్డీయే కూటమి అఖం డ విజయాన్ని అందుకుంది. విపక్ష మహాగఠ్‌బంధన్ మాత్రం 2020 ఎన్నికలతో పోలిస్తే మరిన్ని తక్కువ సీట్లు సాధించి ఘోర పరాభావాన్ని చవిచూ సింది. బీహార్‌లో ఎన్నికలు ముగిసిన వెంటనే విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌లోనూ ఏన్డీయే కూటమిదే అధికారమని అన్ని సర్వే సంస్థలు పేర్కొన్నాయి.

మహాగఠ్‌బంధన్ కూటమి ఈసారి కూడా ఓటమివైపే ఉంటుందని పేర్కొన్న సర్వే సం స్థలు సీట్ల సంఖ్య పరంగా మాత్రం గతంలో కంటే మెరుగైన స్థానం సాధింస్తుందని అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్‌లో మహాగఠ్‌బంధన్‌కు కనీసం 75 నుంచి వంద స్థానాలు వస్తాయని అన్ని సర్వే సంస్థలు పేర్కొంటే.. రియాల్టీలో మాత్రం ఈ కూటమి కనీసం 50 మార్క్‌ను కూడా దాటలేకపోయింది.

గతానికి భిన్నంగా ఈసారి పోలింగ్ కూడా రికార్డు స్థాయిలో జరగడంతో బీహా ర్‌లో అధికార మార్పిడి ఖాయమని అంతా భావించారు. ఎన్నికల ప్రచార సమయంలో బీహార్ ప్రజలంతా మరోమారు అభివృద్ధికే ఓటేస్తారని, ‘జంగల్‌రాజ్’ సర్కార్‌ను ఆహ్వానించబోరని ఎన్డీయే కూటమి నేతలు చేసిన ప్రచారం కూడా జనాలకు బాగా ఎక్కేసినట్లుగా అనిపిస్తున్నది. దీనికి అదనంగా మహి ళా ఓటర్ల శక్తి కూడా ఎన్డీయే కూటమి విజయానికి బాటలు వేసిందని చెప్పొ చ్చు.

బీహార్‌లో లాలూప్రసాద్ సీఎంగా ఉన్న సమయంలో అభివృద్ధి కంటే దోపిడీలు, గుండారాజ్యం, వర్గపోరు, హింసాత్మక ఘటనలతో నిత్యం వణికిపోయేది. లాలుప్రసాద్ పాలనను బీహార్ ప్రజలంతా ‘జంగల్‌రాజ్’ పాలనగా అభివర్ణించేవారు. ఇదే జంగల్‌రాజ్ అంశాన్ని బలంగా ఎత్తుకున్న ఎన్డీయే కూటమి నేతలు ఆ చేదు జ్ఞాపకాలను నేటి యువతరానికి అర్థమయ్యేలా వివరించారు.

బీహార్ సీఎంగా నితీశ్ బాధ్యతలు చేపట్టాకా శాంతిభద్రతలు మెరు గుపడ్డాయి. సీఎంగా ఆయన పాలనలో కొన్ని అపవాదులు ఉన్నప్పటికీ, పరిపాలనలో మాత్రం తన ముద్రను చూపించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్ నుంచి జేడీయూ అత్యధిక స్థానాలు గెలిచింది. దీంతో కేంద్రంలో బీజేపీ సొంతంగా అధికారం చేపట్టే అవకాశం లేకపోవడంతో జేడీయూతో దోస్తీ కొనసాగిస్తూ వార్షిక బడ్జెట్‌లో బీహార్‌కు ప్రాధాన్యతనిచ్చింది.

నిధుల ప్రవాహం పెరగడంతో బీహార్‌లో అభివృద్ధి పరుగులు తీసింది. ఎన్నికలకు ముందు నితీశ్ .. మహిళా సాధికారిత సహా పలు పథకాలు ఎన్డీయేకు అనుకూలంగా మారా యి. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘ఓట్ అధికార్’ పేరుతో బీహార్ వ్యాప్తంగా యాత్రలు చేపట్టి ఈసీపై ఆరోపణలు, నితీశ్ పాలనను ఎండగడుతూ విస్తృత ప్రచారం చేసినప్పటికీ లాభం లేకపోయింది.

దీనికి తోడు సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్ గెలుపుపై ధీమాతో కూటమిలోని పా ర్టీలను పట్టించుకోలేదు. కూటమిలోని ఇతర పార్టీలను సంప్రదించకుండానే హామీలు గుప్పించారు. ముఖ్యంగా 10 లక్షల ఉద్యోగాలు, ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగమని తేజస్వీ ఇచ్చిన హామీ బెడిసికొట్టింది.

ప్రపంచంలో ఎక్కడా ఏ దేశంలోనూ ప్రతి ఇంటికో ఉద్యోగం లేదని, వాటి అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారని స్వయంగా మిత్రపక్షాలే ఆరోపణలు చేయడం తీవ్రంగా దెబ్బకొట్టింది. ఏది ఏమైనా బీహార్‌లో ఓటర్లు మా ర్పు కావాలని కోరుకున్నప్పటికీ.. నితీశ్ చరిష్మా, కేంద్రంలో మోదీ నాయకత్వం ప్రజలను మరోసారి ఎన్డీయే పక్షాన నిలబడేలా చేసింది.