14 April, 2026 | 8:44 PM

మరువలేనిది మంచితనం

15-11-2025 12:00 AM

రఘుపతితో గల అనుబంధం వల్ల సూర్యాపేటకు వెళ్లినప్పుడల్లా వారింట్లోనే బస చేసేవాణ్ణి. రఘుపతికి ముగ్గురమ్యాయిలే. అమ్మాయి ఐనా, అబ్బాయి ఐనా ఒకటే అని నేను చెబుతుండేవాణ్ణి. చిన్న జీవితం, ఇంటి అద్దె బోలెడంత. జీవితం దుర్భరం! ఐనా ధైర్యం చెడకుండా రఘుపతి ముగ్గురమ్మాయిలను ఉన్నత చదువులు చదివించాడు. 

అది 1988వ సంవత్సరం. మా నా న్నగారు బాగా అస్వస్థులయ్యా రు. ఓ.యూలో నా పిహెచ్.డి సిద్ధాంత గ్రంథం సమర్పించే వరకు వారు బ్రతికి ఉండాలని భగవంతుణ్ణి ఎంతగానో ప్రా ర్థించాను. ఈరోజుల్లో లాగా పుస్తకాలను డి.టి.పి చేసేవారు లేరు. నేను నా చేతితోనే నా సిద్ధాంత గ్రంథాన్ని రాశాను. నాన్నగా రు వెళ్లిపోవడానికి రెండు మూడు రోజులు మాత్రమే చిక్కాయి.

అనుకోకుండా ఆపద్భాంధవునిలాగా నా మిత్రుడు వేదాటి రఘుపతి నా ముందు ప్రత్యక్షమయ్యాడు. చేతితో రాసిన నా నాలుగు సిద్ధాంత ప్రతులకు పుట సంఖ్యలు వేయడం మిగిలి ఉం ది. నా కోరిక మేరకు నా మిత్రుడు ఆ రెం డు రోజులు మా ఇంట్లోనే ఉండి, నాకు సహాయపడ్డాడు. సబ్ మిషన్‌కు ముందురోజు రాత్రి మెలకువతో ఉండి పుట సం ఖ్యలు వేశాడు. ఆ మర్నాడే మా నాన్నగా రు కన్నుమూశారు. నేను ఓ.యూలో సి ద్ధాంత గ్రంథప్రతులను నాలుగింటిని స మర్పించి ఊరికి వెళ్లిపోయాను. 

తెలుగు శాఖ అధ్యక్షునిగా..

తగిన సమయంలో నాకు సహకరించిన రఘుపతిగారిని నేనెన్నటికీ మరిచిపో లేదు. అతడు బ్రాహ్మణుల పిల్లవాడైనప్పటికీ నా అర్థాంగి ప్రమీల చేతి వంటకాన్ని రుచి చూడడానికి వెనుకంజ వేసేవాడు కా దు. అందరితో స్నేహంగా ఉండేవాడు. అ వధాని కనుక ఎనిమిది అంశాలు గల అవధానాన్ని మన్నించినట్లే, సమాజంలోని అన్ని తరగతుల వారిని గౌరవించేవాడు. నాకు ఎం.ఏలో జూనియర్ కూడా. రఘుపతి సూర్యాపేట వాస్తవ్యుడు. వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడు. తాత్కాలిక ప్రాతిపదిక మీద ఉద్యోగం చేస్తున్నాడు.

ఏదైతేనేమి ఉద్యోగం దొరకగానే పెళ్లుంది. ఆ తర్వాత కూడా అతడు అవధానాలు మానలేదు. ఓ.యూ తెలుగు శాఖ లో అతడు అవధానం చేయగా నేనే అధ్యక్షునిగా ఉన్నాను. ఛందస్సు, వ్యాకరణం, అలంకార శాస్త్రాలతో పరిచయం లేకపోతే అవధాని కాలేడు. లోకానుభవం, హాస్వ కుశలత ఉంటే అవధానం ఎంతగానో రా ణిస్తుంది. ద్విశతావధాని రాళ్లబండి కవితా ప్రసాద్ నా శిష్యుడే. అతడు నా దగ్గరే పిహెచ్.డి చేశాడు. నేనప్పుడప్పుడు ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి సూర్యా పేటలో జరిగే సాహిత్య కార్యక్రమాలకు వెళ్లి వచ్చాను. ఆ ఏర్పాటు మా రఘుపతి చేయడం వల్లనే సాధ్యమైంది. 

రఘుపతితో అనుబంధం

రఘుపతితో గల అనుబంధం వల్ల సూ ర్యాపేటకు వెళ్లినప్పుడల్లా వారింట్లోనే బస చేసేవాణ్ణి. రఘుపతికి ముగ్గురమ్యాయిలే. అమ్మాయి ఐనా, అబ్బాయి ఐనా ఒకటే అని నేను చెబుతుండేవాణ్ణి. చిన్న జీవితం, ఇంటి అద్దె బోలెడంత. జీవితం దుర్భరం! ఐనా ధైర్యం చెడకుండా రఘుపతి ముగ్గురమ్మాయిలను ఉన్నత చదువులు చదివిం చాడు. రఘుపతి కుటుంబాన్ని చూసినప్పుడల్లా వారికి ఏదో ఒక సహాయం చేయాల నిపించేంది. అది 2008వ సంవత్సరం. ఒకరోజు రఘుపతి ఫోను చేసి ‘ఎక్కడైనా బ్రాహ్మణుల అబ్బాయి మంచి వాడుంటే చెప్పు మిత్రమా!’ అని నన్ను కోరాడు.

నా కు తెలుసు అతని పెద్దమ్మాయి సైన్సు గ్రా డ్యుయేట్. పేరు శ్రీవాణి. సరస్వతి గుణాలన్ని ఆమెలో ఉన్నాయి. నేను నా అర్థాం గిని అడిగాను-.. ‘ఏమోయి మనకు తెలిసిన బ్రాహ్మణుల అబ్బాయి ఎవరైనా పెళ్లికున్నారా?’ అని. పెళ్లి సంబంధాలు కుదర్చ డంలో మనవారి కంటే స్త్రీలకే శ్రద్ధాసక్తులు ఎక్కువ. ఆమె వెంటనే ‘అయ్యో! మీ గురువు గుండేరావు గారి మనుమరాలి కొడుకు పెళ్లికి ఉన్నాడని’ సరస్వతమ్మగారు చెప్పారు’ అంది. నేను నాకున్న పరిచయం వల్ల సరస్వతమ్మ గారికి ఫోన్ చేసి గుండేరావు మనమరాలు చిట్టి ఫోను నంబరు తీసుకున్నాను.

ఆ తర్వాత చిట్టికి ఫోన్ చేసి మాట్లాడగా.. ఆమె నా మాటల కు స్పంది స్తూ.. ‘చిన్నవాడు కరుణాకర్ పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఎవరైనా ఉంటే చెప్పండి’ అనే అమృతం లాంటి మాట వినిపించింది. వెంటనే అమ్మాయి వివరాలు తెలి యజేశాను. అప్పటికీ అబ్బాయి ఆస్ట్రేలియాలో పని చేస్తున్నాడు. అమ్మా యి హై దరాబాదులో ఉంది. పెళ్లి చూపు లు ఎలా ఏర్పాటు చేయాలి? అనే ఆలోచనలో పడ్డాను.

ఆస్ట్రేలియా పర్యటన..

ప్రమీల ఇంటర్ వరకే చదివినా నా కంటే తెలివిగలది. వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఒకరినొకరు పరిచయం చేసుకోవచ్చు కదా! అని తన అభిప్రాయం చెప్పిం ది. ‘మన ఇంటికి రఘుపతి వాళ్లను, చిట్టి వాళ్లను పిలిస్తే సరిపోతుం’దని నా అనుమానాన్ని తీర్చేసంది.. డోలాయమానంలో ఉన్న నన్ను చూసి.

ఒకరోజు రెండు కుటుంబాల వారిని బోడుప్పల్‌లో మా ఇంట్లోనే సమావేశపరిచాను. రెండు కుటుంబాలే గాక, అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. కొన్ని రోజులకే పెళ్లి ఘనంగా జరిగింది. తాను కుదిర్చిన పెళ్లి కలకాలం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఎవరైనా కోరుకుంటారు. అలాంటి వారిలో నేనొక్కడిని.

2012లో నా ప్రియ మిత్రుడైన ధర్మ పురి మురళి ఆహ్వానం మేరకు ఉగాది సం దర్భంగా ‘ఆస్ట్రేలియా తెలుగు సంఘం’ ఏ ర్పాటు చేసిన ‘రసరాగ సుధ’ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం నాకు కలిగింది. నాకు తోడుగా, ప్రఖ్యాత సినీగే య రచయిత ‘సుద్దాల అశోక్ తేజ’ ఉన్నా డు. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ మె ల్‌బోర్న్, సిడ్నీ నగరాల్లోని అద్భుత కట్టడాలను ఇద్దరం సందర్శించాం.

వాటిలో ‘యురేఖా భవనం’, ‘యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్’ ముఖ్యమైనవి. సిడ్నీలోని ఒ లింపిక్స్ క్రీడాస్థలి, ‘ఒపేరా హౌజ్’ మమ్మ ల్ని సమ్మోహితుల్ని చేశాయి. ఒలింపిక్స్ పా ర్కు సరేసరి. అక్కడున్న పదిహేను రోజుల్లో ఒకరోజు ‘శ్రీవాణీ కరుణాకర్’ల కాపురం ఎలా ఉందో చూద్దామని వెళ్లాను.

వారి ఫ్లాట్‌లో అడుగుపెట్టకముందే, అమ్మాయి తన నాలుగు నెలల పసిబిడ్డను నా చేతు ల్లో పెట్టి ‘చెన్నప్ప తాతయ్య వచ్చా’డని ఎం తో సంబరపడిపోయింది. నాకు తెలిసినంతవరకు పెళ్లిళ్లు స్వర్గంలో జరగవు, పెద్దల దూరదృష్టితోనే జరుగుతాయనిపించింది.

వ్యాసకర్త సెల్: 9885654381