ఆరో పణలపై ఈసీ జవాబేదీ?
భారత రాజ్యాంగంలో ఎన్నికల వ్యవస్థకు ఉండే స్వతంత్ర ప్ర తిపత్తి గురించి ఆర్టికల్ 324 తెలుపుతుంది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ప్రమే యం లేకుండా స్వతంత్రంగా పనిచేసే అతికొద్ది సంస్థల్లో భారతీయ ఎన్నికల వ్యవస్థ ప్రధానమైనది. ఎందుకంటే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ఏర్పాటుకై ఓటర్లకు సంబంధించిన ఓటర్ లిస్ట్‌ను తయారు చేసేది, వివిధ రాజకీయ పార్టీలకు గుర్తింపులు, చి హ్నలను కేటాయించేది కూడా కేంద్ర ఎన్నికల సంస్థే.
కాబట్టి ఐదు సంవత్సరాలకి ఒకసారి నూతనంగా ఏర్పాటయ్యే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఎన్నికల వ్యవస్థపై పెత్త నం చెలాయించే హక్కు వివిధ రాజకీయ పార్టీలకు, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరించే హక్కు ఎన్నికల వ్యవస్థపై ఉండదు. భారతదేశం అంటేనే స్వేచ్ఛ, సమానత్వ, సోదరభావ, ప్రజాస్వా మ్య, గణతంత్ర, రాజ్యాంగ దేశంగా ఉండడానికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ద్వారా అంబేడ్కర్ ఎన్నికల వ్యవస్థకు చాలా పటిష్టమైన భద్రతను, స్వతంత్ర హో దాను కల్పించారు.
అందుకే కేంద్ర, రా్రష్ట్ర ప్రభుత్వాల్లో ఎంతటి బలమైన ప్రజాబలం ఉన్న నాయకులు ఉన్నప్పటికీ ఎన్నికల వ్యవస్థని, వాటిని నడిపే అధికారులపై అజమాయిషీ చెలాయించడానికి వీల్లేదు. అం తేకాదు వారికి అనుకూలంగా వ్యవహరించడానికి సాధ్యపడదు. ప్రజాస్వామ్యం వర్ధి ల్లాడానికి భారత రాజ్యాంగం రూపంలో కేంద్ర ఎన్నికల సంఘానికి అత్యున్నతమైన స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉన్నాయి. ఎన్నికల వ్య వస్థ.. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పడానికి నిదర్శనంగా నిలిచింది.
రాజ్యాంగానికి అవమానం!
కానీ గత దశాబ్ద కాలంగా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అనుబంధ ఎన్డీయే ప్రభు త్వ హయాంలో కేంద్ర ఎన్నికల వ్యవస్థ కేం ద్ర ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో అనుకూలంగా, పక్షపాతంగా వ్యవహరిస్తుం దన్న ఆరోపణలు పెరిగిపోయాయి. ఇదే విషయమై ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా ఎన్నికల సంఘం కేంద్రంతో కుమ్మ క్కై వారికి అనుకూలంగా పనిచేస్తుందం టూ బలమైన ఆధారాలతో ఆరోపణలు చేస్తూనే వస్తున్నారు.
అందులో భాగంగానే తాజాగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హ ర్యానా రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాని మోదీ.. కేంద్ర ఎన్నికల సం ఘం వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకొని అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఆధారాలతో సహా ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడిన రాహుల్.. హర్యానా ఎన్నికల ముఖ చిత్రాన్ని, ఎన్నికల్లో జరిగిన అవకతవకలను ప్రొజెక్టర్‌లో బొమ్మ వేసి మరి చూ పించారు.
ఎన్నికల వ్యవస్థ లోపాలను వివరిస్తూనే.. హర్యానాలో దాదాపు 25 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నకిలీ ఓట్ల వల్లనే హర్యానాలో బీజేపీ ప్ర భుత్వాన్ని ఏర్పాటు చేసిందని రాహుల్ వెల్లడించారు. అందుకు బలమైన ఆధారాలను చూపించిన రాహుల్ గాంధీ.. బ్రెజిల్ దేశానికి చెందిన ఒక మోడల్ పేరుపై వివిధ పేర్లతో హర్యానాలో 22 చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడం తనను విస్మయానికి గురి చేసిందని రాహుల్ గాంధీ తెలి పారు. ఓట్ చోరీ జరిగిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటదని ఎద్దేవా చేశారు.
ఈ నేపథ్యంలో బీజేపీ ఓట్‌చోరీకి పాల్పడుతుందనేది నమ్మక తప్పని పరిస్థితి నెలకొన్నదన్నారు. అంతేకాదు హర్యానా ఎన్నికల సమయంలో తన ఫోటో వాడడాన్ని రాహుల్ గాంధీ చూపించడంపై బ్రె జిల్ మోడల్ స్పందించింది. అవి తాను మోడలింగ్ సందర్భంగా గతంలో దిగిన ఫోటోలని, ప్రస్తుతం భారత్‌లో తాను వైర ల్ అవ్వడం, ఓట్ల కోసం ఇలాంటి పిచ్చి పనులు ఎలా చేస్తారని, తనకు భారత్‌లో ఓటు హక్కు ఉండడాన్ని ఆమె తీవ్రంగా ఖండించింది. పరాయి దేశం వ్యక్తి మన ఎన్నికల వ్యవస్థపై ఇలా విమర్శలు చేస్తూ లోపాలను ఎత్తి చూపడం, విదేశీయుల ముందు అత్యున్నత విలువలతో కూడిన భారత రాజ్యాంగాన్ని అవమానపరచడం కిందకే వస్తుంది కదా!
విశ్వాసం కోల్పోతుందా?
రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించడం వర కు బాగానే ఉంది. కానీ ఎన్నికల సంఘం తమ లేదనప్పుడు.. అలాగే కేంద్రానికి అ నుకూలంగా ఎన్నికల వ్యవస్థ వ్యవహరించనప్పుడు తప్పుడు ఆరోపణ చేస్తున్న రా హుల్ గాంధీపై కేంద్రం చట్టపరమైన చర్య లు తీసుకునేలా అధికారులు ఎందుకు ఒ త్తిడి చేయడం లేదన్నది ప్రశ్నార్థకంగా మా రింది.
ఒకవేళ రాహుల్‌పై చర్యలు తీసుకోకుండా కేవలం విమర్శలతోనే ఆగిపోతే రా జ్యాంగ బద్ధ సంస్థ అయిన కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తుందనే విషయం బలపడే ప్రమాద ముంది. ఇదే విషయంలో మేధావులు, విద్యావంతులు, సామాన్య ప్రజలు సైతం ఎన్నికల సంఘంపై విశ్వాసం కోల్పోయే అవకాశం కూడా ఉంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పిలవబడే భారత్‌లో ఒక్క ఓటే నాయకుల గెలుపు, ఓటములను నిర్ణయిస్తుంది.
దేశంలో ఓటుహక్కు అనేది.. ఒకే వ్యక్తి, ఒకే ఓటు, ఒకే విలువ అనే రా జ్యాంగబద్ధమైన ఉన్నత విలువలతో కూ డిన అంశం కాబట్టి ఒక్క ఓటు ఎంతో ము ఖ్యమైనదనే విషయం జగమెరిగిన సత్యం. ఒకవైపు రాహుల్ గాంధీ తన వద్ద ఉన్న పక్కా ఆధారాలతో కేంద్ర ఎన్నికల సం ఘంపై అవకాశం చిక్కినప్పుడల్లా ‘ఈసీ కీ లు బొమ్మగా మారిపోయింది’ అంటూ విమర్శలు చేస్తూనే వస్తున్నారు.
మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో ఎలాం టి లోపాలు లేనప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం తమకు అనుకూలంగా పని చేయ డం లేదన్న నిజం తెలిసినప్పుడు దానిని ప్రజలందరి ముందు నిర్భయంగా చెప్పడంలో ఎందుకు సంకోచిస్తుందనేది అర్థం కాని విషయం. దీనివల్ల రాహుల్ ఆరోపణల్లో నిజం ఉందని భావిస్తున్న ప్రజలు సైతం కేంద్రానికి ఎన్నికల సంఘం కీలు బొమ్మగా మారిందనేది నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. మోదీ ప్రభుత్వం కూడా ఇదే కోరుకుంటుందా లేక తమ తప్పును ఎత్తి చూపుతున్న ప్రతిపక్ష కాంగ్రెస్‌కు గట్టి బుద్ధి చెబుతుందా అన్నది చూడాలి.
అప్పటివరకు భారత రాజ్యాంగం ద్వారా ఎన్నికల వ్యవస్థకు కల్పించిన స్వ తంత్ర ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ.. భారత రాజ్యాంగాన్ని, 140 కోట్ల భారతీయ ప్రజల ఆత్మ గౌరవా న్ని అవమాన పరుస్తున్నట్లే కదా అని భా వించాల్సి ఉంటుంది.
అగౌరవం కిందకే..
భారతీయులు తమ విలువైన ఓటు హ క్కుతో నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో లేని వ్యక్తుల పేరిట ఓట్లు చూయించి, ఒక వ్యక్తికి అనేక ప్రాంతాల్లో ఓట్లు ఉన్నట్లుగా చూపిస్తూ దొంగ దారిని ఆశ్రయిస్తున్నాయా అంటే అవునేమో అ న్న సమాధానమే వినిపిస్తుంది. భారతీయ ప్రజల ఆలోచనకు వ్యతిరేకమైన ప్రభుత్వా లు ఏర్పడుతున్నప్పుడు, ప్రజల ఇష్టాలకు గౌరవం లేనప్పుడు ..
దేశ ప్రజలు ఎంతో ఉన్నతంగా భావించే భారత రాజ్యాంగాన్ని పాలకులు తమకు నచ్చిన విధంగా మా ర్చుకోవడాన్ని చూస్తే ఇది అగౌరవపరచడం కిందకే వస్తుంది. అలాంటప్పుడు ప్ర జాస్వామ్యం, రాజ్యాంగ విలువలు ఎలా వర్ధిల్లుతాయి. అంతిమంగా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)పై నెలకొన్న అనేక సందేహాలకు ఎన్నికల కమిషన్ అధికారులు, కేంద్ర ప్రభుత్వం నైతిక విలువలతో వ్యవహరించి 140 కోట్ల మంది భారతీయులకి వాస్తవాలతో కూడిన సమాధానం చెప్పాల్సిన అవ సరముంది.
భారత సార్వభౌమాధికారా న్ని, భారత రాజ్యాంగ ఔన్నత్యాన్ని, కేంద్ర ఎన్నికల సంఘం తమకు రాజ్యాంగం ఇ చ్చిన స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకునేందుకు ఆయా అధికారులు, కేంద్రం తమ చిత్తశుద్ధిని చాటుకోవాలి. ఇదే విషయమై మేధావులు, విద్యావంతులు, సామాన్య ప్ర జలు సైతం లోతుగా ఆలోచించి రాజకీయ పార్టీలకు, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఒక అవగాహనకు రావాల్సి ఉంది.
వ్యాసకర్త సెల్: 9553041549






