టైటిల్‌కు తగ్గట్టే ఊహించని మలుపులుంటాయ్
ప్రముఖ గాయని సునీత కుమారుడు ఆకాశ్ గోపరాజు హీరోగా నటించిన రెండో చిత్రం ‘కొత్త మలుపు’. దర్శకుడు శివవరప్రసాద్ కేశనకుర్తి తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో ఆకాశ్ మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు. “ఈ సినిమాలో నా పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. నేటి యువత ఆలోచనలు, వారి భావోద్వేగాలకు దగ్గరగా ఉండే పాత్ర ఇది. నటన పరంగా కూడా మొదటి సినిమాతో పోలిస్తే మరింత మెరుగ్గా కనిపించేందుకు ప్రయత్నించా.
బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నా. సీనియర్ల సలహాలతో, మా అమ్మ సూచనలతో నా ఫర్మార్మెన్స్, యాక్టింగ్ స్కిల్స్ చాలా నేర్చుకున్నా. దర్శకుడు శివ వరప్రసాద్ కథ చెప్పినప్పుడు అందులోని ట్విస్టు లు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. నేను ఎలా అయితే సరదాగా సాగిపోయే పాత్ర ఉండాలో అచ్చం అలాంటి పాత్రతో కూడిన సబ్జెక్టును డైరెక్టర్ నాకు చెప్పగానే నాకు బాగా నచ్చింది. ఇక టైటిల్‌కు తగ్గట్టే కథలో వచ్చే మలుపులు ప్రేక్షకులు ఊహించలేరు.
కోనసీమ అందాలను అందంగా చూపిస్తూ, కమర్షియల్ ఎలి మెంట్స్‌తో కథను చాలా ఆసక్తికరంగా తెరకెక్కిం చారు. హీరోయిన్ భైరవి అర్ధ్యా, నేను.. బావ-మరదళ్లుగా కనిపిస్తాం. పల్లెటూరి నేపథ్యంలో సాగే మా పాత్రల మధ్య వచ్చే ప్రేమ, సరదా గొడవలు, ఫన్నీ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. మా అమ్మ సినిమా చూసి చాలా సంతోషించింది. సిని మా అవుట్‌పుట్ చాలా బాగుంద ని, ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని చెప్పింది. నా కెరీర్ విషయంలో కథల ఎంపికలో నాకు పూర్తి స్వేచ్ఛ ఇస్తుంది.
అయితే ఎప్పుడూ నా వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో కూడా ఆమె మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో నిర్మాత తాటి బాలకృష్ణ ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. కథకు ఏది అవసరమో అది అందించాలనే దృక్పథంతో ముందుకు వెళ్లారు. కోనసీమలోని అందమైన లొకేషన్లను సహజత్వానికి దగ్గరగా, గ్రాండ్‌గా చూపించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. చిన్న సిని మాగా కాకుండా, ప్రతి ఫ్రేమ్‌లో ఒక మంచి క్వాలిటీ కనిపించేలా ప్రొడక్షన్ విలువలను మెయింటైన్ చేశారు. నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ పూర్తి సహకారం అందిస్తూ సినిమా కోసం ఎంతో ప్యాషన్‌తో పనిచేశారు.






