17 July, 2026 | 8:34 PM

Breaking News

నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •   పటేల్‌కుంట చెరువుకు సుందరీకరణ పనులు త్వరలో చేపడతాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి   •   బీఆర్ఎస్ వి చౌకబారు రాజకీయాలు: యాదగిరి సునీల్ రావు   •   మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు   •   పట్టు చేనేత డైరెక్టర్‌కు సన్మానం   •   యథేచ్ఛగా చెట్ల నరికివేత.. పర్యావరణానికి ముప్పు   •   రానున్న గోదావరి పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేయాలి   •   గ్రామ అభివృద్ధి కమిటీ వేధింపుల వల్లే ఆత్మహత్యయత్నం   •   రూరల్ జిల్లా బిజెపి(ఓబీసీ) అధ్యక్షులు మహేందర్ యాదవ్ కు ఘన సన్మానం   •   ప్రతిభ చాటిన విద్యార్థులకు ఘన సన్మానం   •  

శ్రీలీలకు చిరు కానుక!

10-03-2025 12:00 AM

చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లో జరుగుతోంది. అక్కడే మరో షూటింగ్‌లో పాల్గొన్న అందాల తార శ్రీలీలకు తనెంతో అభిమానించే చిరంజీవి ప్రస్తుతం ఇదే స్టూడియోలో ఉన్నారని తెలిసింది. దీంతో ఆమె విశ్వంభర సెట్స్‌కు వెళ్లి చిరంజీవిని కలిసింది.

మహిళా దినోత్సవాన తనను కలిసిన శ్రీలీలను చిరు అరుదైన కానుకను బహూకరించారు. శాలువాతో సత్కరించి, దుర్గాదేవి రూపం ముద్రించి ఉన్న శంఖాన్ని కూడా ఆమెకు అందజేశారు. మెగాస్టార్ నుంచి ప్రత్యేక బహుమతిని పొందే అదృష్టం తనకు దక్కటం పట్ల శ్రీలీల ఉబ్బితబ్బిబ్బవుతోంది.

ఈ ప్రత్యేక క్షణాలకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల వేదికగా అందరితో పంచుకుంది. ఇదిలా ఉండగా, ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇటీవల చిరంజీవి తనతో కలిసి పనిచేసిన మహిళా నటీమణులతో ప్రత్యేకంగా గౌరవించిన విషయం తెలిసిందే. ఇతర మహిళలకు సైతం తన సోషల్ మీడియా వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు మెగాస్టార్.