17 July, 2026 | 8:28 PM

బీఆర్ఎస్ వి చౌకబారు రాజకీయాలు: యాదగిరి సునీల్ రావు

17-07-2026 08:28 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ లో శాంతియుతంగా జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలలో బీఆర్ఎస్ పార్టీ మరియు స్థానిక ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగా  చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని  నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, యాదగిరి సునీల్ రావు ఆరోపించారు. రామ్ నగర్  మిత్ర యూత్ ఆధ్వర్యంలో అఖిల్ గౌడ్, వారి మిత్ర బృందం గత 30 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలను నిరాటంకంగా,  నిర్వహిస్తున్నారని పర్యావరణ పరిరక్షణ పట్ల శ్రద్ధ వహిస్తూ, నగరంలోనే ప్రత్యేకంగా మట్టి వినాయకుడిని తయారు చేయించి ప్రతిష్టించడం వీరి గొప్పతనం.

పండుగను సైతం బీఆర్ఎస్ రాజకీయం చేయాలని చూడటం వారి దిగజారుడుతనానికి నిదర్శనం అని అన్నారు. ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి, పోటీగా విగ్రహాలు పెట్టించడం  శోచనీయం. 30 ఏళ్లుగా ఉన్న మండపానికి కేవలం 10 నుంచి 15 అడుగుల దూరంలోనే మరో కొత్త మండపాన్ని ఏర్పాటు చేయడానికి బీఆర్ఎస్ ప్రయత్నించడం కవ్వింపు చర్యే అన్నారు. పోలీసు యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకొని, ఎవరైనా కొత్తగా మండపం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే తగినంత దూరం పాటించేలా లేదా వేరే స్థలాన్ని చూసుకునే లా చర్యలు తీసుకోవాలని కోరారు.