రూరల్ జిల్లా బిజెపి(ఓబీసీ) అధ్యక్షులు మహేందర్ యాదవ్ కు ఘన సన్మానం
పార్టీ బలోపితానికి కృషి చేయండి: ఏనుగు సుదర్శన్ రెడ్డి
జవహర్ నగర్,(విజయక్రాంతి): మేడ్చల్ రూరల్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఓబీసీ అధ్యక్షుడిగా నియమితులైన మహేందర్ యాదవ్ కు మేడ్చల్ నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తూ ఓబీసీ వర్గాల సంక్షేమం పార్టీ విస్తరణకు కృషి చేయాలని ఆకాంక్షించారు.
దేశవ్యాప్తంగా ఓబీసీ వర్గాల రాజకీయ సామాజిక సాధికారకతకు బిజెపి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మహేందర్ యాదవ్ నాయకత్వంలో మేడ్చల్ జిల్లా ఓబీసీ మోర్చా మరింత చురుకుగా పనిచేస్తూ పార్టీని గ్రామస్థాయి వరకు బలోపితం చేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహేందర్ యాదవ్ మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని, ఓబీసీ వర్గాల సమస్యలను పరిష్కరిస్తానని పార్టీ విస్తరణ కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.






