17 July, 2026 | 8:21 PM

పట్టు చేనేత డైరెక్టర్‌కు సన్మానం

17-07-2026 08:21 PM

ఆర్మూర్,(విజయక్రాంతి): ఆర్మూర్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పట్టు చేనేత సహకార సంఘం డైరెక్టర్ గా ఎన్నికైన రొటేరియన్ ఖాందేశ్ సత్యమును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 3150 రోటరీ క్లబ్ మాజీ గవర్నర్ ఎన్.వి. హన్మంత్ రెడ్డి హాజరయ్యారు. పట్టు శాలువా, పూల దండలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ క్లబ్ లో సేవలు అందించినట్లుగానే పట్టు చేనేత సహకార సంఘంలో సేవలు అందించాలని ఆశించారు.

ప్రభుత్వం నుండి నేత కార్మికులకు రావాల్సిన పథకాలు, నేత కార్మికులకు అందాల్సిన ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని అన్నారు. సంఘ సభ్యులకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని ఖాందేశ్ సత్యం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు వన్నెల్ దేవి రాము, కార్యదర్శి పివిఆర్ శ్రీకాంత్, కోశాధికారి రాస ఆనంద్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్, రోటరియన్స్ దాసరి సునీల్ కుమార్, చరణ్ రెడ్డి, వంగ వివేకానంద, రాధాకిషన్, సురేష్, చోటి లింబాద్రి, చెలిమేల రాజేందర్, కత్రాజీ రాజేందర్, మారుతీ తదితరులు పాల్గొన్నారు.