దమ్ దమ్.. ఆనందం..
మాస్ పోయెట్రీతో మ్యూజికల్ లవ్‌స్టోరీ(Musical Love Story) ‘చకోర: లూనార్ లవ్ బర్డ్’(Chakora: Lunar Lovebird). శ్రవణ్(Shravan), మలైకా టీ వాసుపల్(Malaika T. Vasupal)ను పరిచయం చేస్తూ తెరకెక్కిందీ చిత్రం. పూరి జగన్నాథ్(Puri Jagannadh) వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన మంగా శ్రీనివాస్(Manga Srinivas) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. హై జాయ్ కమర్షియల్స్, వింటేజ్ ఐకాన్ పిక్చర్స్ బ్యానర్లపై డాక్టర్ చింతాడ హేమారావు నిర్మిస్తున్నారు.
ఇందులో అనుష్క లూహార్, యామిని, ఎల్‌బీ శ్రీరామ్, సుమన్, బ్రహ్మాజీ, ఇంద్రజ, మణి చందన, నెల్లూరు సుదర్శన్, ప్రభావతి, మాధవి ప్రసాద్, జనార్దన్, ఆకెళ్ల గోపాలకృష్ణ, వంగపండు, వంశీ, సుమంత్, భాను, సూర్య మాకిరెడ్డి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 8న విడుదల కానున్న ఈ మూవీ సెకండ్ సాంగ్ ‘ధమ్ ధమ్’ను సంగీత దర్శక నటుడు జీవీ ప్రకాశ్ కుమార్ ఆవిష్కరించారు.
‘హూ ఆర్ యూ నువ్వు ఎవరు.. డేటాఫ్ బర్త్‌కి ముందర.. నీ మెమరీ గుర్తుపడుతుందా, వేర్ ఆర్ యూ ప్యాకప్ చెప్పేశాక.. గుగుల్ నీ జాడ చెబుతుందా, ఉన్నాన్నాళ్లే భూమ్మీద సందడి.. ఓ కొన్నాళ్లే నూరేళ్లేనా.. ఖుల్లంఖుల్లా చేసేద్దాం అల్లరి.. వాళ్లూవీళ్లూ ఏమనుకున్నా, దమ్ దమ్ దమ్ దమ్.. ఆ ఆ ఆనందం.. ఎక్కడుందో తాట తీసేద్దాం, దమ్ దమ్ దమ్ దమ్.. ఆ ఆ ఆనందం.. అంచుదాటి అంతు చూసేద్దాం..’ అంటూ సాగుతోందీ గీతం. చిత్ర సంగీత దర్శకుడు ప్రిన్స్ హెన్రీ స్వరపర్చిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, అభిఖ్య తనికెళ్ల పాడారు. ఈ చిత్రానికి డీవోపీ: రుప్ప గోపీకృష్ణ; ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేశ్; ప్రొడక్షన్ డిజైన్: రామ్‌చరణ్ తేజ్ లాభాని.