ఐలమ్మ స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం

26-09-2026 | 05:35am

సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ(Chakali Ilamma)కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఘన నివాళులర్పించారు. అణచివేత, దోపిడీకి వ్యతిరే కంగా భూమి, భుక్తి, హక్కుల కోసం ఐలమ్మ() సాగించిన పోరాటం తెలంగాణ సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.

సామాజిక న్యాయం, సమాన త్వం, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చూ పిన మార్గం నేటి తరానికి ఆదర్శమని సీఎం పేర్కొన్నారు. ఆమె 131వ జయంతి సందర్భంగా ఐలమ్మ స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం బీసీలు, పేదలు, మహిళలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. దాదాపు 80 ఏళ్ల క్రితమే తెలంగాణ గడ్డపై దొరల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఐలమ్మ పోరాటానికి జంగ్ సైరన్ మోగించారని సీఎం గుర్తుచేశారు. సమ్మక్క-, సారలమ్మ, చాకలి ఐలమ్మ వంటి వీర మహిళల స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని తెలిపారు.

కోఠిలోని మహిళా విశ్వవిద్యాలయానికి  చాకలి ఐలమ్మ పేరు పెట్టి ఆమె సేవలను స్మ రించుకున్నామని సీఎం చెప్పారు. ఐలమ్మతో పాటు తెలంగాణ వీర మహిళలు చూపిన ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటి తరాలకు కూడా ఆదర్శమని అన్నారు. బీసీ విద్యార్థులకు మెరుగైన విద్య, గురుకులాలు, హాస్టళ్లలో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు యువత, మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం చర్య లు తీసుకుంటోందని రేవంత్‌రెడ్డి  తెలిపారు. సమాజంలోని ప్రతి వర్గానికీ సమాన అవకాశాలు, గౌర వం, న్యాయం అందించడమే చాకలి ఐలమ్మకు అందించే నిజమైన నివాళి సీఎం స్పష్టం చేశా రు.

చాకలి ఐలమ్మ సేవలు చిరస్మరణీయం: మహేష్‌గౌడ్

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ధీర వనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) నివాళులు అర్పించారు. చాకలి ఐలమ్మ అణగారిన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన గొప్ప యోధురాలని కొనియాడారు.

భూస్వామ్య దోపిడీ, అన్యాయానికి వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో స్ఫూర్తిదాయకమైన అధ్యాయంగా నిలిచిందన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం చాక లి ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. అణగారిన వ ర్గాల హక్కుల కోసం ఆమె చూ పిన ధై ర్యం, పట్టుదల, పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజం లో మ హిళా సాధికారతకు, సామాజి క చైతన్యానికి చాకలి ఐలమ్మ చేసిన కృషి విశిష్టమై నదని మహేష్ కుమార్‌గౌడ్ అన్నారు.

మరిన్ని వార్తలు