ఆధ్యాత్మిక రచనల్లో అగ్రగామి!
ఆచార్య మసన చెన్నప్ప :
కావ్య సుధ తన 55 ఏళ్ల సాహితీ ప్రస్థానం(Literary Journey)లో సుమారు రెండు వేల వ్యాసాలు పత్రికల(Articles in magazines)లో ప్రచురించారు. 2023 నుంచి విశాఖపట్నం(Visakhapatnam) నుంచి వెలువడే ‘మెట్రో వాయిస్(Metro Voice)’ దినపత్రికలో ప్రతి రోజు ఒక వ్యాసం రాస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే(Telugu states) కాక, ఇతర రాష్ట్రాల్లోని పురాతన దేవాలయాల చరిత్ర(History of Ancient Temples)లను, మూలాలను వెదికి తెలుపుతున్నారు.
ప్రతి రోజు ఏదో ఒక పత్రికలో ఏదో ఒక ప్రసిద్ధమైన దేవాలయం(Temple) మీద సచిత్ర వ్యాసం రాసి ప్రసిద్ధిగ న్న కావ్యసుధ అల్ప సంతోషి. ఏ పత్రిక అతనికి ఎలాంటి పారితోషికం ఇవ్వకున్నా ఆత్మ తృప్తి కోసం కలం పట్టి అశేష తెలుగు పాఠకుల(Telugu readers)ను ప్రతి రోజు ఏదో ఒక కొత్త, పాత దేవాలయంలోకి తీసుకెళ్లి స్థల చరిత్ర ను, ఆలయ పవిత్రతను, విగ్రహ మహిమను తెలియజేసే కావ్యసుధ అసలు పేరు శ్రీహరిశంకర్.
శ్రీహరిశంకర్ ఆర్‌టీసీలో ఉద్యోగస్థుడైనా, ఆయన రచనాయోగం ఆలయ సం స్కృతిని ఎరుకపరచడమే.
కావ్య సుధ తన 55 ఏళ్ల సాహితీ ప్రస్థానంలో సుమారు రెండు వేల వ్యాసాలు ప త్రికలలో ప్రచురించారు. 2023 నుంచి వి శాఖపట్నం నుంచి వెలువడే ‘మెట్రో వా యిస్’ దినపత్రికలో ప్రతి రోజు ఒక వ్యా సం రాస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక, ఇతర రాష్ట్రాల్లోని పురాతన దేవాలయాల చరిత్రలను, మూలాలను వెదికి తెలుపుతున్నారు. ఇప్పటికీ వెయ్యిదాకా పురాతన దేవాలయాల మీద వ్యాసాలు రాశారు.
వయోవృద్ధులకు మనశ్శాంతి కలగాలనే ఉద్దేశంతో ఆధ్యాత్మిక రచనలు చేస్తు న్న కావ్యసుధను అభినందించిన వారిలో సినారె, ఉత్పల, బోయి భీమన్న, పోతుకూ చి, ముకురాల, బాపురెడ్డి, చెన్నప్ప, రాధ శ్రీ మొదలైన వారున్నారు.
1970లో ఆకాశవాణి హైదరాబాద్ కేం ద్రంలో యువవాణిలో తన తొలి కవితకు బీజావాపన జరిగింది. ముషీరాబాద్ హైస్కూల్‌లో చదివిన కావ్యసుధ హైస్కూ ల్ మ్యాగజైన్‌లోనూ, కళాశాల మ్యాగజైన్‌లోనూ వ్యాసాలు ప్రచురించారు.
కావ్యసుధ ఒక బస్సు కండక్టర్. కానీ, అ తని అంతరంగం సాహిత్య సుధామయం. మహాకవి ఉత్పలను తాను కండక్టర్‌గా బస్సులో అలకాపురి నుంచి సికింద్రాబాద్ దాకా ఎక్కించుకొని వెళ్లేటప్పుడు ఆ కవీశ్వరుని ఆశీర్వాదం లభించింది.
కావ్యసుధ మన తెలుగు పత్రికల్లో ఉగా ది మొదలుకొని అన్ని పండుగలకు ప్రత్యేక వ్యాసాలు అందించారు. ఆయన వ్యాస ర చనలను ప్రచురించే భాగ్యం అన్ని పత్రికలకు లభించింది. వాటిని చదివిన పాఠకు లు ఆలయాల మీద గౌరవాన్ని పెంచుకున్నారు. ఆయా దేవతామూర్తుల మీద భక్తి ని పంచుకున్నారు. వారు ఏ వ్యాసం రా సినా దానికి ఆధారం కైఫీయతైనా అయి ఉంటుంది. లేదా శాసనమైనా అయి ఉం టుంది. లేదా అర్చకులను ఇంటర్వ్యూ చేసి స్థల పురాణాలను అవగాహన చేసుకున్నదైనా అయి ఉంటుంది.
దేవాలయాలను సాంస్కృతిక కేంద్రాలుగా భావించే కావ్యసుధకు గుండెనిండా భక్తి! ప్రాచీన కాలంలో హరికథలకు, బుర్రకథలకు, యక్షగానాలకు, పురాణ కాల క్షేపాలకు ఆలవాలమైన దేవాలయాలు, క ళానిలయాలు దారితప్పి అర్చనలకు మా త్రమే పరిమితం కావడం ఆయనకు కొం చెం నిరాశ కలిగిస్తుంది. భక్తికి, ముక్తికి, సాంస్కృతిక రంగానికి, సనాతన ధర్మానికి, కళలకు ఆలయాలు ఉపయోగపడాలని విశ్వసిస్తారు కావ్యసుధ.
ఆర్‌టీసీలో కండక్టర్‌గా ఉద్యోగాన్ని ఆ రంభించిన అతనికి 2014లో ఉన్నతోద్యోగిగా పదవీ విరమణ చేసే భాగ్యం కలిగిం ది. గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా కావ్యసుధ సాహిత్య కృషికి ప్రోత్యా హకంగా 2012లో అప్పటి ముఖ్యమంత్రితో సత్కారం అందుకున్నారు. ‘ధర్మకేత నం’, ‘మానస ఆర్ట్స్ థియేటర్’ మొదలైన సంస్థలు ఆయనను గౌరవించాయి. మచిలీపట్నం నుంచి వెలువడే వాణి మాస పత్రిక ఆయనకు ‘సాహితీ ధురీణ’ బిరుదునిచ్చింది. ‘వాఙ్మయ భూషణ’ అనే బిరుదు కూడా అదే పత్రిక 2018లో ఇ చ్చింది. ఇంకా వారు వివిధ సంస్థల ద్వారా ‘సాహితీ రత్న’, ఆధ్యాత్మిక సాహిత్య సా మ్రాట్’, ‘ఆధ్యాత్మిక వ్యాస భూషణ్’ మొదలైన బిరుదులు సాధించారు.
కావ్యసుధ కేవలం వ్యాసకర్తగానే కాక పుస్తక సమీక్షలు చేయడంలోనూ దిట్ట. మహాకవి బోయి భీమన్న ‘గుడిసెలు కాలిపోతున్నాయి’ కావ్యంపై మొదటి సమీక్ష రాసి ‘జనధర్మ’ పత్రికలో ప్రచురించారు.
ఉత్పల వారి ‘స్వప్నాల దుప్పటి’ కావ్యా న్ని ‘ఆంధ్రభూమి’ పత్రికలో సమీక్షించారు. ఆ సమీక్షను చదివిన సదరు రచయిత కావ్యసుధను ఇంటికి పిలిచి సన్మానించడం అతని జీవితంలో మరపురాని సం ఘటన. అలాగే మహాకవి భీమన్న, హైమావతి గార్ల అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి ఆయన. నాకు కావ్యసుధకు కన్నోజు లక్ష్మికాంతం గారి వల్ల పరిచయం కలిగింది. నేను కావ్యసుధను ‘ప్రమీలాశక్తి పీఠం’ ఆ ధ్యర్యంలో పద్మారావు నగర్‌లోని శివనందాశ్రమంలో నగదు పారితోషికం ఇచ్చి ఘనంగా సన్మానించాను.
కావ్యసుధ నా ఆధ్యాత్మిక గ్రంథాలలో ‘దశోపనిషత్తులు’, ‘ప్రమీలా త్రిశతి’, ‘సడి లేని అడుగులు’ అనే గ్రంథాల మీద అనితర సాధ్యమైన రీతిలో సమీక్షా వ్యాసాలు రాశారు. నా అర్ధాంగి ప్రమీల దివంగతురాలైనప్పుడు ఆయన రాసిన స్మృతి కవిత నా కు కన్నీరు పెట్టించింది. ‘సఖియై, సుఖియై గిరిజగా శక్తినిచ్చి, భారతిగా జ్ఞానమిచ్చి, నీ రజగా సంపదలిచ్చిన ప్రమీల’ అన్న వా క్యాలు నా చెవుల్లో మార్మోగుతుంటాయి.
ఒకసారి ఇంటికి కావ్యసుధ వచ్చినప్పు డు ప్రమీల ఆయనకు సంత్రాలు ఒలిచిపెట్టి చూపిన ఆప్యాయతను ఇప్పటికీ జ్ఞాప కం చేస్తారు. నా ‘సడి లేని అడుగులు’ సమీక్షిస్తూ ‘రాగోర్ నిర్భయంగా తల ఎత్తుకొని నిలిచే భారతం కోరాడు. మా చెన్నప్ప సడిలేని అడుగులలో నడిచే భారతాన్ని చూపాడు’ అని నా అనువాదాన్ని ప్రశంసించారు.
ఇటీవల జరిగిన గురుపూజోత్సవం నాడు ‘తెలుగు లోకం’ అనే పత్రికలో ‘వేదపండితులు ఆచార్య మసన చెన్నప్ప గారికి గురువందనం’ పేరుతో ఒక దీర్ఘమైన కవితను ప్రచురించారు.
‘కాలం ఎంత మారినా/ యుగాలెన్ని గడిచినా/ ధర్మానికి మూలస్తంభంగా/ నిలి చే మహానుభావులుంటారు/ ఆ మూలస్తంభాల్లో/ ఆచార్య మసన చెన్నప్ప ఒకరు/’ అని వారు నాపై కురిపించిన ప్రశంసాపూర్వకమైన జల్లుగాను, నాకు బాధ్యతను గుర్తుచేసినట్టు గాను భావించాను.
వేదానికి నమస్కరించడం/ ధర్మానికి నమస్కరించడం/ మూలపురుషులకు న మస్కరించడం/ అవుతుంది గురువందనం/’ అన్న మాటలు వ్యర్థ మనక తప్పదు.
కావ్యసుధ కవిగానే గాక, ఒక సహృదయుడుగా స్పందించే తీరు నాకు ఆశ్చర్యా న్ని కల్గిస్తుంది. ఆయన ఎవరి మనస్సునూ నొప్పించని నిర్మలాంతరంగుడు. ఎప్పుడైనా నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన ‘ప్రమీలా త్రిశతి’ పద్యాల గురించే మాట్లాడుతాడు.
‘తోడు నీడవయ్యి తొయ్యలి నీవుండ
బాధనొక్క నాడు పడగ లేదు,
నీవు పోయినంత నిజమయ్యె నా స్థితి
నేలక్రుంగి నింగికూలినట్లు’
ఈ పద్యాన్ని ఉదహరించి నేను కొం డంత ఆవేదనకు గురయ్యానని తానూ బాధపడతాడు.
‘నా విలువం గురితించుకాలం బరుదెంచున్
మీరు వీక్షింతురు’ అని ప్రమీల నన్ను అప్పుడప్పుడు హెచ్చరించేది. నిజమే నేను ఈ పదేళ్లుగా ప్రమీలను అడుగడుగున గుర్తిస్తూనే ఉన్నాను. 40 ఏళ్లు తోడునీడగా ఉన్న సతి పరలోకానికి వెళ్లిపోతే ఎట్టి భర్తలకైనా దుర్గతియే కదా?
నా ‘ప్రమీలా త్రిశతి’ గురించి అద్భుతమైన సమీక్షా వ్యాసాన్ని రచించి ‘మోక్షం’ పత్రికలో ప్రచురింపజేసిన కావ్యసుధను నేనెన్నడూ మరిచిపోలేను.
కావ్యసుధ ఆలయ సంస్కృతికి అద్దం పట్టే రచనలు చేస్తే, నేను వేద సంస్కృతికి అద్దం పట్టే రచనలు చేశాను. ఆయన మిత్రుడు కావడం అదృష్టంగా భావిస్తాను నేను.
వ్యాసకర్త సెల్: 9885654381