10 March, 2026 | 3:21 AM

సంస్థాగత కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పెద్దపీఠ

10-03-2026 01:42 AM

శ్రీరంగాపురం మార్చ్ 9: శ్రీరంగాపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంపై ప్రత్యేక సమావేశం సోమవారం నిర్వహించారు. మండల అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల్ల చిన్నారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డి  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెఘా రెడ్డి మాట్లాడుతూ పార్టీని బూత్ స్థాయి నుండి బలోపేతం చేసి మరింత పటిష్టంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తె లిపారు. నాయకత్వ సామర్థ్యాలను పెంపొందించి గ్రామ స్థాయిలో పార్టీ కార్యకలాపాలను విస్తరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. పార్టీ శ్రేణులు ఐక్యతగా పనిచేస్తేనే కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందని పిలుపునిచ్చారు. గతంలో ఉన్న మండల కమిటీలతో పోలిస్తే ఇప్పుడు ఏర్పడబోయే మండల కమిటీల పనితీరులో స్పష్టమైన మార్పులు ఉంటాయని తెలిపారు.

గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరేలా సంస్థాగత, గ్రామ కమిటీలు, బూత్ కమిటీలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నారు. పార్టీకి నిబద్ధతతో పనిచేసే నాయకులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని, కొత్తగా ఎన్నుకోబడే మండల అధ్యక్షుడు మరియు కార్యవర్గం పార్టీ బలోపేతానికి సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.

శ్రీరంగాపురం మండల అధ్యక్షుడు మరియు కార్యవర్గానికి పలువురు నాయకులు దరఖాస్తులు సమర్పించగా, వాటిని జిల్లా అధ్యక్షులు పరిశీలించి అధిష్టానం ఆదేశాల మేరకు తుది నియామకాలు జరుగుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ప్రమోదిని రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు రాములు, సీనియర్ నాయకులు బ్రహ్మం చారి, పలువురు సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.