10 March, 2026 | 4:59 AM

యాప్‌తో రైతుల తంటాలు

10-03-2026 01:40 AM

యూరియా కోసం సెల్ ఫోన్లో కుస్తీ పడుతున్న రైతులు

చారకొండ మార్చి 9: యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మండల కేంద్రంలోని పిఎసిఎస్ కార్యాలయానికి 300 ల బస్తాల యూరియా వచ్చింది. దీంతో  వ్యవసాయ అధికారులు ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో పెట్టడంతో బుకింగ్ చేసుకోవడానికి రైతులు ఉదయం 10 గంటలకే పీఏసీఎస్ కార్యాలయం వద్దకు వచ్చారు.

11 గంటలకు ఆన్ లైన్ స్టార్ట్ కావడంతో తమ తమ సెల్ ఫోన్ లో యూరియా కోసం ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటున్న రైతులకు 30 సెకండ్లలోపే 300 బస్తాల యూరియా స్టాక్ అయిపోయిందని చూపించడంతో ఏమి చేయలేక వెనుదిరిగారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం పాత పద్ధతిలోనే రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేశారు. యూరియా సకాలంలో దొరకకపోవడంతో తాము సాగు చేసిన పంటలు తెగుళ్ల బారిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలని రైతులు కోరారు.