24 March, 2026 | 8:00 PM

Breaking News

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన   •   జన గణనను పకడ్బందీగా పూర్తి చేయాలి   •   ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలి   •   ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •  

గురుకుల విద్యార్థినికి అరుదైన గౌరవం

09-02-2025 12:00 AM

ప్రశంసిస్తూ ప్రధాని మోదీ లేఖ

నిర్మల్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండలానికి చెందిన హర్షిత నిర్మల్ పట్టణంలోని సోఫి  గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నది. హర్షితకు అరుదైన గౌరవం దక్కిం  గతేడాది గుజరాత్‌లో సెప్టెంబరులో నిర్వహించిన జాతీయ స్థాయి ప్రేరణ సద  కార్యక్రమంలో తెలంగాణ తరఫున ఏకైక విద్యార్థిగా హర్షిత పాల్గొంది.

ఆ సదస్సులో ప్రయోగాత్మక నైపుణ్యాభి వృద్ధి భారత నిర్మాణంలో ఐదు మౌలిక సూత్రాలపై ప్రజేంటేషన్ ఇచ్చింది. ప్రేరణలో పాల్గొని జాతీయస్థాయిలో మంచి గుర్తింపు తెచ్చు కున్న హర్షిత ప్రతిభను గుర్తించిన ప్రధాని నరేంద్ర మోదీ హర్షితకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ లేఖ రాయడం విశేషం. ఈ లేఖ శనివారం పాఠశాలకు చేరుకోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.