24 March, 2026 | 8:19 PM

Breaking News

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన   •   జన గణనను పకడ్బందీగా పూర్తి చేయాలి   •   ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలి   •   ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •  

కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

24-03-2026 07:16 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని జనకాపూర్లోని శ్రీ కోదండరామాలయం వద్ద మంగళవారం మున్సిపల్ ఆధ్వర్యంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ పనులను మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ గజానంద్, స్థానిక కౌన్సిలర్లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ​

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ మున్సిపల్ సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వేడుకల కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు.