24 March, 2026 | 9:04 PM

ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్

24-03-2026 07:29 PM

కోదాడ,(విజయ క్రాంతి): మండల పరిధిలోని ద్వారకుంట గ్రామం నెమలిపురి కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి సిసి రోడ్డు పనులకు గ్రామ సర్పంచ్ పాలకి సురేష్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ నిధులు రూ.10 లక్షలతో ఈ రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. రహదారి దుస్థితి కారణంగా వాహనదారులు, గురుకుల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన సిసి రోడ్డు పనులు ప్రారంభించినట్లు చెప్పారు. పల్లె దివకానకు వెళ్లే వారికి కూడా ఈ రహదారి ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పత్తిపాక వెంకటేశ్వర్లు, బాలకృష్ణ, గ్రామ కార్యదర్శి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.