కల్తీల కల్తీల రాజ్యం

11-09-2026 | 05:30am

హోటళ్లపై టీజీ సేఫ్ మెరుపుదాడులు

  1. కలుషిత మాంసం.. కుళ్లిపోయిన కూరగాయలు
  2.    46 చోట్ల తీవ్ర ఉల్లంఘనలు 
  3.    4 హోటళ్ల లైసెన్సులు రద్దు

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణ(Telangana)లో ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న హోటళ్లు(Hotels), రెస్టారెంట్ల(restaurants)పై ఆహార భద్రతా విభాగానికి(Food Safety Department) చెందిన టీజీ సేఫ్ అధికారులు(TG SAFE officials) గురు వారం దాడులు చేశారు. కల్తీ, కలుషిత మాంసం, కుళ్లిపోయిన కూరగాయలు(Adulterated and contaminated meat, rotten vegetables) ఉన్నట్టు గుర్తించారు. 46 చోట్ల నిర్వాహకుల తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడినట్టు గుర్తించగా.. 4 హోటళ్ల లైసెన్సుల(Hotel licenses)ను రద్దు చేశారు. కోర్ అర్బన్ రీజియన్ వెలుపల ఉన్న పలు జిల్లాల్లోని హోటళ్లు, స్వీట్ షాపులు(Sweet shops), హాస్టళ్లు, బేకరీలు(Bakeries), దాబాల్లో ఏకకాలంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

మొత్తం 46 ఆహార సంస్థల్లో జరిపిన ఈ తనిఖీల్లో దిగ్భ్రాంతికర అంశాలు వెలుగుచూశాయి. కుళ్లిపోయిన మాంసం, ఎలుకలు తిరగడం గుర్తించారు. తనిఖీల సందర్భంగా పలు హోటళ్లలో కల్తీ, కలుషిత మాంసంతో పాటు కుళ్లిపోయిన కూరగాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆహార పదార్థాలపై బొద్దింకలు, ఈగలు, ఎలుకలు తిరుగుతు న్న దృశ్యాలను చూసి అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రిజ్‌లు అపరిశుభ్రంగా ఉండటమే కాకుండా, వెజ్, నాన్-వెజ్ పదార్థాలను ఒకే చోట కలిపి ఉంచినట్లు గుర్తించారు.

గడువు ముగిసిన, పురుగులు పట్టిన ఆహార పదార్థాలను లేబులింగ్ లేకుండా విక్రయిస్తున్నట్లు తేలింది. సిబ్బంది కనీస వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడంపైనా అధికారులు మండిపడ్డారు. అనుమానాస్పదంగా ఉన్న 22 ఆహార పదార్థాల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. పురుగులు పట్టిన, కుళ్లిపోయిన ఆహార పదార్థాలను అక్కడికక్కడే పారబోశారు. నిబంధనలు పాటించని 23 సంస్థలకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు అందించారు.

తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన ౪ వ్యాపార సంస్థల ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులను అధికారులు తక్షణమే సస్పెండ్ చేసి, వ్యాపారాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. వాటిలో మహేంద్ర మీల్స్, బిర్యానీ అండ్ కర్రీ పాయింట్ (స్టేషన్ ఘన్‌పూర్), శ్రీ బాలాజీ మ్యాజిక్ మిఠాయి దుకాణం (బావ్‌పేట, కరీంనగర్), చాచా ఫ్యామిలీ దాబా (ఎన్‌హెచ్--65, చౌటుప్పల్, యాదాద్రి జిల్లా) ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని, భవిష్యత్తులోనూ ఈ తనిఖీలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు