పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక
సందడిగా శ్రీనివాస హైస్కూల్ గెట్ టు గెదర్
కరీంనగర్, జూన్ 28(విజయక్రాంతి) : పూర్వ విద్యార్థులు ఒక చోటుకు చేరుకున్నారు. కరీంనగర్‌లోని శ్రీనివాస హైస్కూల్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం నాటి సమ్మేళనంలో సందడి చేశారు. 1998 లో పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యా ర్థు లు 27 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒకరినొకరు కలుసుకున్నారు. రాజీవ్‌చౌక్‌లోని ప్రముఖ హోటల్ ఇందుకు వేదికైంది. దాదా పు 35 మంది విద్యార్థులు ఒక దగ్గరకు చేరి గత స్మృతులను గుర్తుకు చేసుకున్నారు. బా ల్యం నాటి తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
ఆనాడు విద్యా బుద్దులు నేర్పించిన ఉప్యాధాయుల సేవలను యాదికి చేసుకుం టూ వారికి కృతజ్ఞతలు తె లిపారు. పాఠశాల దశ నుంచి కాలేజీ, ఉద్యోగాలు, కుటుంబసభ్యుల విషయాలను ఒకరికొకరు పంచుకు న్నారు. ఉపాధ్యాయులు విశ్వనాథ్, వేణుమూర్తిని ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత మళ్లీ కలుసుకుందామంటూ ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు.






