30 July, 2026 | 1:08 AM

సంపూర్ణ నవ్వులు పూయించే పాత్ర

30-07-2026 12:03 AM

విక్టరీ వెంకటేశ్ ‘చిట్టిబాబు’గా, శ్రీనిధి శెట్టి ‘స్వర్ణ’గా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందిన తర్వాత, ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం:47’ (ఏకే47) చిత్రబృందం ఈ కుటుంబంలోని మరో సభ్యురాలిని పరిచయం చేసింది. ఈ చిత్రంలో చిట్టిబాబు, స్వర్ణ దంపతుల ముద్దుల కుమార్తె ‘సంపూర్ణ’ పాత్రలో బాలనటి యువినా పార్థవి నటిస్తోంది. అమాయకత్వం, చిలిపితనం, అల్లరితో నిండిన సంపూర్ణ పాత్ర చిట్టిబాబు జీవితంలో నవ్వులు పూయించడంతోపాటు, అనూహ్యమైన చిన్న చిన్న సంఘటనలకు కూడా కారణమవుతుంది.

ఈ పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేలా ఉండనుందని చిత్రబృందం తెలిపింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీని, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది.