30 July, 2026 | 1:03 AM

లక్ష్మీపూర్ నుంచి నీటి విడుదల

30-07-2026 12:20 AM
  1. మూడు పంపుల ద్వారా మిడ్ మానేరుకు 9,145 క్యూసెక్కుల నీరు 
  2. తాగునీటి అవసరాల కోసం విడుదల

కరీంనగర్, జూలై 29 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ బరాజ్ గాయత్రి పంప్ హౌస్ మూడు పంపుల ద్వారా మిడ్ మానేరుకు 9145 క్యూసెక్కుల నీటిని బుధవారం విడుదల చేశారు. వర్షాబావ పరిస్థితుల దృశ్య ఎల్లంపల్లిలో నీటిమట్టం తగ్గిపోవడంతో ఇంతవరకు నీటిని విడుదల చేయని అధికారులు.. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీటిని విడుదల చేయుటకు సిద్ధమయ్యారు.

ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం గణనీయంగా తగ్గడంతో సాగునీరు అందే పరిస్థితి లేకుండా పోయింది. కాగా కనీసం తాగునీటి సమస్య తీవ్రంగా తలెత్తే పరిస్థితి నెలకొనడంతో గాయత్రి పంప్ హౌస్ నుంచి నీటిని తరలించే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. బుధవారం మూడు పంపుల ద్వారా 9450 క్యూసెక్కుల నీటిని డెలివరీ సిస్టర్న్ నుంచి గ్రావిటీ కెనాల్‌కు విడుదల చేశారు.

నేరుగా వరద కాలువలోనికి ప్రవేశించి అక్కడి నుంచి పరవళ్లు తొక్కుతూ మిడ్ మానేరు వైపు వెళ్తున్నది. మరో మూడు రోజులపాటు ఈ నీటి విడుదల కొనసాగుతుందని అధికారులు తెలిపారు. వర్షాలు ఇలానే కురిస్తే సాగునీటికి విడుదల చేసేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. గాయత్రి పంప్ హౌస్‌ను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ వేర్వేరుగా సందర్శించి, పోటాపోటీగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.