16 July, 2026 | 12:17 PM

రొమాంటిక్ లవ్‌స్టోరీ ప్రారంభం

06-12-2024 12:00 AM

బాల నటుడిగా అలరించిన దీపక్ సరోజ్ ఇటీవల ‘సిద్ధార్థ రాయ్’ సినిమాతో హీరోగా మారి ప్రేక్షకులను అలరించాడు. ఆయన కథానాయకుడిగా ఓ కొత్త చిత్రం రూపొందుతోంది. రొమాంటిక్ కల్ట్ లవ్‌స్టోరీతో వస్తున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీనరసింహ ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. హరీశ్ గదగాని దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాతో తన్నీరు హరిబాబు నిర్మాతగా మారుతున్నారు. దీక్షిక, అనైరా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో రఘుబాబు, హైపర్ ఆది, సత్య, యూట్యూబర్ పుంజు, యాదమ్మ రాజు, రచ్చ రవి ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథు లుగా దర్శకులు వేణు ఊడుగుల, ప్రదీప్ మద్దాలి, యదు వంశీతోపాటు సుజిత్- సందీప్, సందీప్ సరోజ్, భరత్ పెద్దగాని, ఉదయ్‌శర్మ, వంశీ చాగంటి తదితరులు హాజరయ్యారు. షూటింగ్‌ను జనవరిలో మొదలుపెట్టి ఏప్రిల్ లో ముగించేలా ప్లాన్ చేస్తున్నామని దర్శక నిర్మాతలు ఈ సందర్భంగా తెలిపారు. ఈ సినిమాకు సంగీతం: అనూప్ రూబెన్స్; డీవోపీ: సురేశ్ రగుతు; ఎడిటర్:  యాక్షన్ డైరెక్టర్: మదికొండ నటరాజ్.