మరో తెలుగు దర్శకుడికి గ్రీన్‌సిగ్నల్
హీరోయిన్లు భాషా భేదం లేకుండా ఏ ఇండస్ట్రీలో క్లిక్ అయితే ఆ ఇండస్ట్రీలో చేస్తుంటారు కానీ హీరోలు అలా కాదు. వేరే భాషల దర్శకులతో చేసే హీరోలు చాలా తక్కువగా ఉంటారు. అది కూడా సదరు దర్శకుడు టాప్ అయి ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. కానీ దుల్కర్ మాత్రం తెలుగు డెబ్యూ దర్శకులకు సైతం అవకాశం ఇస్తున్నారు. ఇప్పటికే ఓ తెలుగు దర్శకుడితో ‘లక్కీ భాస్కర్’ సినిమా చేసి రూ.100 కోట్ల క్లబ్‌లో దుల్కర్ చేరారు. ఇప్పుడు మరో తెలుగు డెబ్యూ దర్శకుడితో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో మహేశ్ బాబు హీరోగా వచ్చిన ‘సర్కారు వారి పాట’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన రవి ఇప్పుడు దర్శకుడిగా మారి దుల్కర్‌తో సినిమా చేయనున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 11న ప్రారంభం కానుంది. డిసెంబర్ తొలి వారంలో స్క్రీన్ టెస్ట్ నిర్వహిస్తారట. రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. వినూత్న ప్రేమకథను కథాంశంగా తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ‘సీతారామం’తో దుల్కర్ పెద్ద హిట్ కొట్టారు. ఇది కూడా ప్రేమేకథే అనడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి.






