‘కానిస్టేబుల్’గా వరుణ్ సందేశ్
06-12-2024 12:00 AM
వరుణ్ సందేశ్ కథానాయకుడిగా ఆర్యన్ సుభాన్ ఎస్‌కే దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీశ్ నిర్మిస్తున్న చిత్రం ‘కానిస్టేబుల్’. ఇందులో వరుణ్ సందేశ్‌కు జోడీగా మధులిక వారణాసి హీరోయిన్‌గా తొలిసారి పరిచయం కానున్నారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. దువ్వాసి మోహన్, సూర్య, రవివర్మ, మురళీధర్‌గౌడ్, బలగం జగదీశ్, ప్రభావతి, కల్పలత, నిత్యశ్రీ, శ్రీభవ్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: హజరత్ షేక్ (వలి), సంగీతం: సుభాష్ ఆనంద్; మాటలు : శ్రీనివాస్ తేజ, పాటలు: రామారావు, శ్రీనివాస్ తేజ.






