దద్దరిల్లిన టెహ్రాన్
- సైనిక స్థావరాలే లక్ష్యం ఇజ్రాయెల్ బాంబుల వర్షం
- బంకర్ల పేల్చివేత.. ఖమేనీ బంకర్‌పై 50 జెట్లతో దాడి
- అనేక నగరాలపై భారీ వైమానిక దాడులు
- బాలిస్టిక్ క్షిపణి స్థావరాలపై బీ2 స్టెల్త్ గురి
- డజన్ల కొద్ది ‘పెనెట్రేటర్’ బాంబుల మోత
టెహ్రాన్, మార్చి6: అమెరికాెేఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఇరాన్‌లో యుద్ధం మరింత ముదురుతోంది. ఏడోరోజు టెహ్రా న్, ఇస్ఫహాన్ సహా అనేక నగరాలపై భారీ వైమానిక దాడులు జరిగాయి. శుక్రవారం ఉదయం నుంచి టెహ్రాన్‌పై కొత్త తరహా దాడులను ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ వైమానిక దళాలు ప్రకటించాయి. ఇరాన్ ప్రభుత్వ మౌలిక వసతులు, సైనిక స్థావరాలు లక్ష్యంగా బాంబులతో విరుచుకుప డ్డట్లు పేర్కొన్నాయి.
గురువారం రాత్రి టెహ్రా న్ నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ పేలు ళ్లు సంభవించాయి. టెహ్రాన్ యూనివర్సిటీ పరిసరాలు, నివాస ప్రాంతాలు, కార్ పార్కింగ్‌లు, పెట్రోల్ బంకులు కూడా దాడులకు గురైనట్లు తెలిసింది. పేలుళ్ల ప్రభావంతో నగరంలో పొగలు భారీగా ఎగిసిపడ్డాయి. అమె రికా సెంట్రల్ కమాండ్ ప్రకారం.. బీ2 స్టెల్త్ బాంబర్లు భూగర్భంలో దాగి ఉన్న బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ కేంద్రాలపై డజన్ల కొద్ది 2000 పౌండ్ల ‘పెనెట్రేటర్’ బాంబులు వేశాయి.
ఇజ్రాయెల్ వైమానికదళం ఆరు క్షిపణి లాంచర్లను ధ్వంసం చేసిందని, మూ డు ఆధునిక ఇరానియన్ రక్షణ వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసినట్లు ప్రకటించింది. అమెరికా రక్షణకార్యదర్శి పీట్‌హెగ్సేత్ మా ట్లాడుతూ.. రాబాయే రోజుల్లో దాడులు మరింత ఉధృతం అవుతాయని హెచ్చరించారు. మరిన్ని యుద్ధవిమానాలు, బాంబర్ల తో దాడులు పెరుగుతాయని పేర్కొన్నారు.
టెహ్రాన్‌లోని ఖమేనీ బంకర్‌పై ఇజ్రాయెల్ బాంబుల దాడిచేసింది. ఖమేనీ మరణం తర్వాత 50 జెట్లు బంకర్‌ను ఢీకొన్నాయి. ఇజ్రాయెల్ ఫైటర్‌జెట్లు శుక్రవారం తెల్లవారుజామున అతిపెద్ద దాడిని నిర్వహించా యి. ఇరాన్ సుప్రీం నేత కోసం నిర్మించిన భూగర్భ బంకర్‌ను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించాయి. ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన కచ్చితమైన నిఘా ద్వారా, మొస్సాద్ సమన్వయం తో ఈ ఆపరేషన్ నిర్వహించింది.




