నిలిచిన మట్టి తరలింపు
* విజయక్రాంతి కథనానికి స్పందన
* ఎక్సవేటర్లను తిప్పి పంపిన అధికారులు
కరీంనగర్: జూన్ 12 (విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్, దుండ్రపల్లి గ్రామాల్లోని చెరువుకుంటల నుంచి నల్లమట్టి తరలిస్తున్న ఎక్సవేటర్లను నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు, లస్కర్లు శుక్రవారం తిప్పి పంపించారు. నల్ల మట్టి తీస్తే చర్యలు తప్పవని హెచ్చరించి పంపించారు. శుక్రవారం విజయక్రాంతి దినపత్రికలో గడువు ముగిసిన ఆగట్లే అనే శీర్షికన ప్రస్తుతమైన కథనానికి ఆ శాఖ ఇంజనీరింగ్ అధికారులు స్పందించి నల్లమట్టి తరలింపును నిలిపివేశారు.
అదేవిధంగా అనుమతి లే కుండా చెరువుకుంటలో న ల్ల మట్టి తీస్తే చర్యలు తప్పవని తప్పవని హెచ్చరించి పంపించా రు. అదేవిధంగా విలాసాగర్ చెరువులో ఎక్సవేటర్ యజమాని తీసుకెళ్లడానికి కొంత జాప్యం చేయడంతో లస్కర్లు అక్కడే కాపలా ఉండి వాహనం వచ్చేవరకు ఉండి పంపించారు. అదేవిధంగా దుండ్రపల్లి గ్రామంలో కూడా ఎక్సరేటర్ను ఇంజనీరింగ్ అధికారులు దగ్గరుండి పంపించి ఇప్పటివరకు ఎంత నల్లమట్టి తరలించారని విచారణ జరిపారు. అనంతరం పూర్తిస్థాయిలో జిల్లా అధికారులకు నివేదిక పంపించినట్లు వారు తెలిపారు.






