13 April, 2026 | 4:17 AM

యూట్యూబ్ వినియోగదారులకు షాక్

28-08-2024 01:35 AM
  1. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరల పెంపు 
  2. ప్లాన్ల ధరల్లో 58 శాతం మేర పెరుగుదల

న్యూఢిల్లీ, ఆగస్టు 27 : భారతదేశంలోని యూట్యూబ్ ప్రీమియం వినియోగ దారులకు ఆ సంస్థ షాకిచ్చింది. తాజాగా వాటి ప్లాన్ల ధరలను పెంచేసింది. దాదా పు 58శాతం మేర ధరలు పెరిగాయి. ప్రతి సంవత్సరం యూట్యూబ్ ప్రీమి యం ప్లాన్ల ధరలను పెంచడం లేదా తగ్గించడం వంటివి చేస్తూ ఉంటుంది. అయితే ఈసారి యూట్యూబ్‌లో యాడ్ ఫ్రీ కంటెంట్ కావాలనుకునే వారికి ఇటీవల టారిఫ్ చార్జీలు పెరిగిన సంగతి తెలి సిందే. ఇప్పుడు ప్రీమియం ప్లాన్ల ధరలు కూడా పెరగడంతో వినియోగదారులకు మోత మోగనుంది. ధరల పెంపుపై ఇప్పటికే వినియోగదారులకు మెయిల్స్ పంపించామని సంస్థ ప్రతినిథి తెలిపారు. అత్యధికంగా యూట్యూబ్ ఫ్యామిలీ ప్లాన్ రూ.110 మేర పెరిగింది. ఇలా పలు ప్రయోజనాలను సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారు పొందవచ్చు.

ధరల పెంపు ఇలా..

  1. వ్యక్తిగత నెలవారీ ప్లాన్: రూ.129 నుంచి 149కి పెరిగింది.
  2. విద్యార్థి నెలవారీ ప్లాన్: రూ.79 నుంచి 89
  3. కుటుంబ నెలవారీ ప్లాన్: రూ.189 నుంచిరూ.299
  4. వ్యక్తిగత ప్రీపెయిడ్ నెలవారీ ప్లాన్: రూ.139 నుంచి 159 
  5. వ్యక్తిగత క్వార్టర్లీ ప్లాన్: రూ.399 నుంచి రూ.459కి పెరిగింది.
  6. వ్యక్తిగత వార్షిక ప్లాన్: రూ.1290 నుంచి రూ.1490కి పెరిగింది.