calender_icon.png 14 February, 2026 | 7:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరికొత్త పాత్రలతో అలా జరిగిన కథ

14-02-2026 12:00:00 AM

విజయ్, శీతల్ భట్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అలా జరిగిన కథ’. ప్రభు సూర్య దర్శకత్వంలో ఏపీఆర్ సినీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై రేణుక శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీను, రవివర్మ, శివరెడ్డి, బిగ్‌బాస్ ఫేమ్ జ్యోతి, జబర్దస్త్ రాజమౌళి తదితరులు కీలక పాత్రలు పోషించారు. కేవీ గోలంధర్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి మహావీర్ సంగీతాన్ని అందించగా కొండవీటి రవికుమార్ ఎడిటర్‌గా పనిచేశారు. ఈ చిత్రబృందం తొలిసారి ప్రెస్‌మీట్ నిర్వహిచింది.

ఈ సందర్భంగా కథానాయకుడు విజయ్ మాట్లాడుతూ.. “నన్ను ఈ సినిమాలో ఎంకరేజ్ చేసిన చిత్రబృందానికి థాంక్స్. అందరూ ఈ సినిమాను ఆదరించవలసిందిగా కోరుకుంటున్నా” అన్నారు. ‘ఈ సినిమాలో నటీనటుల పాత్రలు కొత్తగా ఉంటాయి. దానికి వారంతా బాగా కనెక్ట్ అయ్యార’ని దర్శకుడు ప్రభు సూర్య తెలిపారు. నిర్మాత రేణుక శ్రీనివాస్ మాట్లాడుతూ.. “ఇది మా బ్యానర్ నుంచి వస్తున్న తొలిచిత్రం. సూర్య చెప్పినప్పుడు మంచి సక్సెస్ అవుతుందని నమ్మకంతో కథకు కనెక్ట్ అయ్యాన’ని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటీనటులు చిత్రం శ్రీను, రవివర్మ, జబర్దస్త్ రాజమౌళి,  బిగ్‌బాస్ ఫేమ్ జ్యోతి, సంగీత దర్శకుడు మహావీర్, డీవోపీ గోలంధర్ తదితర చిత్రబృందం కూడా మాట్లాడారు.