calender_icon.png 13 February, 2026 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముద్దు సీన్ల గురించి ముందే చెప్పారు

13-02-2026 12:00:00 AM

సంతోష్ శోభన్, మానస వారణాసి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ’. యూవీ కాన్సెప్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను తెలంగాణ, ఏపీల్లో ధీరజ్ మొగిలినేని రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా హైలైట్స్‌ను కథానాయకి మానస వారణాసి విలేకులతో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. 

* ఈ ‘కపుల్ ఫ్రెండ్లీ’ డైరెక్టర్, టీమ్‌ను కలిశాక వీళ్లొక మ్యాజిక్ క్రియేట్ చేయాలనుకుంటారని అర్థమైంది. ఈ చిత్రంలో మిత్ర అనే క్యారెక్టర్‌లో నటించా. తను సరదా అమ్మాయి. అనుకున్నది వెంటనే చేసేస్తుంది. కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంటుంది. మిత్రకు చెప్తా చెప్తా అనే డైలాగ్ ఊతపదం.  

* ‘కపుల్ ఫ్రెండ్లీ’లో ఆ రొటీన్ ప్రేమకథ ఉండదు. శివ, మిత్ర ప్రపంచాలు వేరు. వాళ్ల లక్ష్యాలు వేరు, వేరే ఊర్ల నుంచి చెన్నై వస్తారు. ఇలాంటి ఒక అమ్మాయి, అబ్బాయి కలవడమే అరుదైన విషయం. లివింగ్ టుగెదర్ అనేది నేను నా లైఫ్‌లో ఎప్పుడూ ట్రై చేయలేదు. ఈ సినిమాలో ఆ కాన్సెప్ట్‌ను కొత్తగా చూపిస్తున్నాం. ఇప్పటి యువత చాలా స్మార్ట్‌గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. 

* కపుల్ ఫ్రెండ్లీ అనే టైటిల్‌కు సెన్సార్ వారు ఎందుకు అభ్యంతరం చెప్పారో నాకు అర్థం కాలేదు. ‘కపుల్ ఫ్రెండ్లీ’ అనే మాటకు ఎన్నో అర్థాలు తీసుకోవచ్చు. పాజిటివ్‌గా తీసుకుంటే శివ, మిత్ర కపుల్స్, వాళ్లు ఫ్రెండ్లీగా ఉంటారు అనుకోవచ్చు. ఈ సినిమాలో యువతతోపాటు కుటుంబ ప్రేక్షకులకు కూడా నచ్చే అంశాలుంటాయి.  

* ఈ సినిమాలో సన్నిహితంగా ఉండే సన్నివేశాలుంటాయి. కథ చెప్పినప్పుడే ఇది లవ్‌స్టోరీ.. రెండు ముద్దు సీన్స్ ఉంటాయని చెప్పారు. మొదట్లో నేను సందేహిం చాను. కానీ మా డీవోపీ, డైరెక్టర్, హీరో సంతోష్.. ఇలా టీమ్ అంతా ప్రొఫెషనల్, హానెస్ట్‌గా ఉన్నారు. వీళ్లు అసభ్యంగా సన్నివేశాలు చిత్రీకరించరని నమ్మకం కలిగింది.

నాకొక కంఫర్ట్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. సంతోష్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఈ టీమ్ అంతా ఒక మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు ట్రై చేస్తుంటే నటిగా నేనూ ప్రొఫెషనల్‌గా ఉండాలని నటించా. రొమాంటిక్ సీన్స్ అయినా బ్యూటిఫుల్‌గా పొయెటిక్‌గా తెరకెక్కించారు. నా దృష్టిలో గ్లామర్ అంటే ఎక్స్‌పోజింగ్ కాదు. 

* అందాల పోటీల్లో గెలిచిన అందరూ సినిమా ఇండస్ట్రీకే రారు. వేర్వేరు ప్రొఫెషన్స్‌ను ఎంచుకున్న వాళ్లున్నారు. పోటీలకు సన్నద్ధమయ్యే టైమ్‌లో ఎక్కువగా కెమెరాల ముందు అలవాటు అవుతాం. దాంతో సినిమా కెరీర్‌కు ఎక్కువగా ఆకర్షితమవుతుంటాం. నేను మిస్ ఇండియా పోటీలకు సిద్ధమవుతున్న సమయంలోనే సినిమా అవకాశాలు వచ్చాయి. అప్పుడు నాకు అర్థం కాలేదు. మిస్ వరల్డ్ పోటీల నుంచి తిరిగి వచ్చాక ఇండస్ట్రీ పట్ల ఆకర్షణ పెరిగింది.

తమ ఇంటి నుంచి అమ్మాయి సినిమాల్లోకి వెళ్తుందంటే మధ్యతరగతి కుటుంబాలు భయపడతాయి. మనకు తెలియని ఇండస్ట్రీలో ఎవర్ని నమ్మాలి?.. సపోర్ట్ చేస్తారు..? లాంటి భయాలు మావాళ్లకూ ఉండేవి. ఈ మూవీ టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యాక మా ఇంట్లో వాళ్లు కొంచెం ఇబ్బందిగా మాట్లాడారు. మన వారణాసి కుటుంబంలో ఉండి ఇలా ఎలా చేశావు అన్నారు. ఆ తర్వాత మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. సపోర్ట్ చేశారు. 

* మా డైరెక్టర్‌ది తమిళనాడు అయినా ఆయనకు తెలుగు తెలుసు. నేటివిటీకి నచ్చేలా రెండు భాషల్లో డైలాగ్స్ రాశారు. నేను తమిళంలోనూ డబ్బింగ్ చెబుదామని ప్ర యత్నించా. కానీ, డైరెక్టర్‌కు నా తమిళ యాస నచ్చలేదు. నా తర్వాతి సినిమా  కోలీవుడ్ లోనే చేస్తున్నా. తెలుగులో కథలు వింటున్నా. జాగ్రత్తగా ఎం పిక చేసుకోవాలనుకుం టున్నా. యువతకు సందేశాన్నిచ్చేలా ఉండే యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీస్ చేయాలనుం ది. అలాగే థ్రిల్లరి మిస్టరీస్, డిటెక్టివ్ మిస్టరీస్, రొమాంటిక్ కామెడీస్, ఫీల్ గుడ్ మూవీస్ చేయాలనుకుం టున్నా.