30 July, 2026 | 5:41 PM

Breaking News

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి   •   ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు   •   మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •   భారీ వర్షాలపై అత్యవసర సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు   •   మంథనిలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాలు ప్రారంభం   •  

లైసెన్స్ లేని, నాణ్యత లేని విక్రయదారులకు బారీ జరిమానా

30-07-2026 04:46 PM

ఆహార వ్యాపారులు తప్పనిసరిగా ఆహార భద్రతా లైసెన్స్ తీసుకోవాలని సూచన

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): ఆహార వ్యాపారులు తప్పనిసరిగా ఆహార భద్రత లైసెన్స్ తీసుకోవాలని ఆహార భద్రతా అధికారి వరుణ్ రెడ్డి అన్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆహార భద్రతా అధికారి వరుణ్ రెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా లైసెన్సు లేకుండా బేకరీ నడుపుతున్నందుకు రూ.10,000 జరిమానా అదేవిధంగా వేరుశెనగలు, శనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వంటి నాణ్యత లేని ఆహారాన్ని విక్రయించే వారిపై రూ.75,000 జరిమానా విధించారు. ఈ జరిమానాలు వివిధ దుకాణాలు, రెస్టారెంట్లపై విధించారు. ప్రజలకు సురక్షితమైన కల్తీ లేని ఆహారాన్ని ఇవ్వాలని ఈ ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.