20 May, 2026 | 3:54 PM

Breaking News

మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన నాయకులు   •   ఉత్పత్తి లక్ష్యాల సాధనే ధ్యేయంగా పునరంకితమవ్వాలి   •   సింగరేణిని కాపాడుకోవడమే తెలంగాణ బొగ్గుగని కార్మిక సమాఖ్య ఏకైక లక్ష్యం   •   మైనర్ బాలికను మభ్యపెట్టి వివాహం చేసుకున్న పోలీస్ కానిస్టేబుల్   •   నవోదయ ఫలితాల్లో బ్లూమింగ్ మైండ్స్ విద్యార్థుల ప్రతిభ   •   ఆన్‌లైన్ మందుల అమ్మకాలను నిలిపివేయాలి   •   మనోహర్ లాల్ ఖట్టర్‌తో మంత్రి కిషన్ రెడ్డి భేటీ.. పట్టణాభివృద్ధిపై చర్చ   •   సుప్రీంకోర్టు సీరియస్.. కులగణ పిటిషన్‌ కొట్టివేత   •   దేశవ్యాప్తంగా మెడికల్ దుకాణాలు బంద్   •   కొనసాగుతున్న ఎల్లయ్య చెరువు కాలువల పూడికతీతల పనులు   •  

కాకి వలె కనిపిస్తున్న చెట్టు పువ్వు

08-10-2025 12:00 AM

మణుగూరు, అక్టోబర్ 7 (విజయక్రాంతి) : అనంతవిశ్వం భగవంతుని సృష్టి, ఒక అద్భుతం, వర్ణింపనలవికాని అందమైన కావ్యం. మానవ పరిణామక్రమం ప్రకృతితో మమేకమై ఉన్నది. అలాంటి అద్భుత ఘటన మణుగూరు లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పార్క్లో ప్రకృతి తన సృజనా త్మక తను మరోసారి చూపించింది. పార్క్ లోని ఒక చెట్టు కొమ్మపై పువ్వు సమూహం ఆకారం చూసిన వారు ఆశ్చర్యపో తున్నారు. ఆ పువ్వు సమూహం పూర్తిగా కాకి రూపం దాల్చినట్లుగా కనిపిస్తోంది.

స్థానికులు చెబుతున్నదేమిటంటే, ఆ చెట్టు పువ్వు దూరం నుంచే చూసినప్పుడు కాకి కూర్చున్నట్టుగా అనిపిస్తోందని, దగ్గరగా వెళ్లి చూసినప్పుడు మాత్రమే అది పువ్వు అని తెలుస్తుందని అంటున్నారు. పక్షి వలె వంగిన తల, పొడవైన ముక్కు ఆకారం, చెట్టు కొమ్మల మధ్య చక్కగా సమతుల్యం సాధించిన ఈ పువ్వు సమూహం చూడగానే ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రకృతిలో దాగి ఉన్న కళాత్మక రూపాలను చూసి మణుగూరు ప్రజలు ముచ్చటపడుతున్నారు. ఇది ప్రకృతి స్వయంగా వేసిన పెయింటింగ్ లాంటిది అని పార్క్ సందర్శకులు వ్యాఖ్యా నించారు. ఈ అద్భుతాన్ని ఫోటో తీసుకునేందుకు పలువురు పోటీ పడుతున్నారు.